(Source: Poll of Polls)
Liger: 'లైగర్'తో పూరి, ఛార్మీలకు కోట్లలో లాభాలు - మరి నష్టపోయిందెవరు?
'లైగర్' సినిమాతో నిర్మాతలు ఘోరంగా నష్టపోయారని.. విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని తిరిగివ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది.
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) లేటెస్ట్ సినిమా 'లైగర్'(Liger). పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియన్ సినిమా ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి, రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ కాంబోలో ఈ సినిమా రావడంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. వీరిద్దరు కలిసి రూపొందించిన తొలి సినిమా సైతం ఇదే కావడంతో మంచి విజయం సాధిస్తుందని అందరూ భావించారు.
కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో నిర్మాతలు ఘోరంగా నష్టపోయారని.. విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని తిరిగివ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అసలు నిజమేంటంటే.. ఈ సినిమాతో నిర్మాతలు కోట్ల లాభాలు పొందారట. సినిమా మేకింగ్ కోసం రూ.50 నుంచి రూ.60 కోట్లు ఖర్చు చేశారట. ఈ సినిమాను బాలీవుడ్ కి చెందిన డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ రూ.90 కోట్లకు కొన్నారని సమాచారం.
ఈ సినిమాతో అటు పూరి, ఛార్మీ.. ఇటు అనిల్ తడానీ కూడా బాగానే వెనకేసుకున్నారని చెబుతున్నారు. శాటిలైట్, ఓటీటీ రైట్స్ ను కూడా భారీ మొత్తానికి అమ్మడంతో వారికి బాగానే డబ్బులు వచ్చాయట. సినిమాకి మరో నిర్మాతగా వ్యవహరించినకరణ్ జోహార్ డబ్బులు కూడా పోలేదట. ఈ సినిమాతో నిర్మాతలు లాభాలు పొందితే.. డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్స్ కి ఎలాంటి సెటిల్మెంట్స్ చేయలేదని ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.
హీరో విజయ్ దేవరకొండకి కూడా రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వలేదట. సినిమా మేకింగ్ సమయంలో విజయ్ కి పాతిక శాతం రెమ్యునరేషన్ ఇచ్చారట. సినిమా హిట్ అవుతుందనే ధీమాతో విజయ్ మిగిలిన రెమ్యునరేషన్ రిలీజ్ తరువాత తీసుకుంటానని చెప్పారట. ఇప్పుడు సినిమా ప్లాప్ అవ్వడంతో విజయ్ కి ఇవ్వాల్సిన మిగతా రెమ్యునరేషన్ కూడా ఇవ్వడం లేదట. విజయ్ రూ.6 కోట్లు తిరిగిచ్చినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.
ఆగిపోయిన 'జనగణమన':
'లైగర్' పరాజయానికి కారణాలు ఏమైనా... ఆ ప్రభావం 'జనగణమణ' సినిమా మీద పడింది. పూరి, విజయ్ కాంబినేషన్ లో రావాలనుకున్న ఈ రెండో సినిమాకి ఫుల్ స్టాప్ పెట్టేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుసగా మూడు సినిమాలు చేయాలని విజయ్ దేవరకొండ అనుకున్నారు. 'లైగర్' విడుదలకు ముందు 'జన గణ మణ' స్టార్ట్ చేశారు. ఒక షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది కూడా! అయితే... 'లైగర్' ఫ్లాప్ కావడంతో మూడో సినిమా సంగతి పక్కన పెడితే, రెండో సినిమా 'జన గణ మణ' కూడా ఆపేశారు. పూరి దర్శకత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.
Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?