అన్వేషించండి

Bunny Vas: 'తప్పుడు ఆరోపణలు నమ్మొద్దు' సునీత బోయ ఇష్యూపై నిర్మాత బన్నీ వాస్ వివరణ

నటి సునీత బోయ తనకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి బన్నీ వాసు మోసం చేశారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

నటి సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్ట్... నిర్మాత బన్నీ వాసు గురించి చేసిన ఆరోపణలు సంచలనమైన సంగతి తెలిసిందే. తనకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి బన్నీ వాసు మోసం చేశారని.. ఈ విషయంలో పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ కల్పించుకుని తనకు న్యాయం చేయాలని ఆమె సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేయడం సంచలనం అయింది. ఈ విషయంపై ఇప్పటికే పలుసార్లు వివరణ ఇచ్చిన బన్నీ వాసు తాజాగా మరోసారి ఆయన టీమ్ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. 

అందులో ఏమని రాసి ఉందంటే.. 'మిస్ సునీత బోయ అనే అమ్మాయి తప్పుడు ఆరోపణలు చేస్తున్న విషయంపై కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి.. అంటే 2019 నుంచి ఇప్పటి వరకు సునీత బోయ.. గీతా ఆర్ట్స్ సంస్థ.. అలాగే నిర్మాత బన్నీ వాస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది. ఆమె సమాజంలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకునేది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు హెడ్ లైన్స్‌లో ఉండటానికి.. కావాలనే వివాదాస్పద విషయాల్లో వేలు పెట్టడం.. వాటికి సంబంధించిన డిబేట్స్‌లో పాలు పంచుకోవడం చేస్తుంది. ఈమెకు ముందు నుంచి కూడా అలవాటు ఇది. దీనికి ఆధారాలు కావాలంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఆమె పోస్ట్‌లు, యూట్యూబ్ లింక్‌లను చూడవచ్చు. వాటిని చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది సునీత బోయ మనస్తత్వం ఏంటనేది. 

ఇలాంటి పనులు ముందు నుంచే చేస్తున్న సునీత.. దాదాపు అన్నింట్లోనూ విజయం సాధించింది. ఒక్క గీతా ఆర్ట్స్ సంస్థ, బన్నీ వాస్ గారి విషయంలో తప్ప. వాళ్లు ఈమె బెదిరింపులకు, అబద్ధపు ఆరోపణలకు లొంగలేదు.. బెదరలేదు. ఈమె జీవితంలో ఏదో బాధలో ఉండుంటుందని భావించి.. సునీత ఆరోపణలపై బన్నీ వాస్ గారు ఏ మాత్రం స్పందించలేదు. సినిమా ఇండస్ట్రీలోనూ అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమై ఉంటుందేమో అనే జాలితో వదిలేసారు. అయితే ఆమెకు పరిస్థితులను జీర్ణించుకోవడం కష్టంగా మారింది. దాంతో మళ్లీ గీతా ఆర్ట్స్ సంస్థతో పాటు.. నిర్మాత బన్నీ వాస్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి కేవలం బన్నీ వాస్ గారిని మాత్రమే కాకుండా.. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుడు, బంధువులను కూడా రాతల్లో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ కావాలనే రెచ్చగొడుతుంది సునీత బోయ. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్, ఫేస్ బుక్ లాంటి చోట్ల అసభ్యకరమైన పదజాలంతో ఆమె ఆరోపణలు చేస్తుంది. అలాగే బన్నీ వాస్ గారి నాలుగేళ్ల కుమార్తెను చంపాలనే ఆలోచనలు తనకు వస్తున్నాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఆమె ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆమె ఇంతకి దిగజారిన తర్వాత.. మరో దారి లేక బన్నీ వాస్ గారు న్యాయబద్ధంగా పోరాడాలని.. పోలీసులతో పాటు గౌరవ న్యాయస్థానం వైపు అడుగులు వేసారు. 

పోలీసులను ఆశ్రయించిన తర్వాత బన్నీ వాస్ పై మరింత పగ పెంచుకున్న సునీత బోయ.. తన వేధింపులను తారాస్థాయికి తీసుకెళ్లింది. బన్నీ వాస్ గారితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులపై తీవ్రస్థాయిలో వేధింపులు పెంచేసింది. అక్కడితో ఆగకుండా తనను లైంగిక వేధింపులకు గురి చేసాడని కొత్త కట్టుకథతో ముందుకొచ్చింది. ఇదంతా పూర్తిగా అబద్ధమని బన్నీ వాస్ తెలియజేసారు. అసలు విచిత్రం ఏంటంటే ఏ రోజు కూడా సునీత బోయ అనే అమ్మాయిని బన్నీ వాస్ కలవలేదు. అసలు పరిచయమే లేని వాస్ పై.. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది సునీత. గీతా ఆర్ట్స్ సంస్థ, బన్నీ వాస్ కదలికలను ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన సునీత బోయ.. చాలాసార్లు అతడిపై దాడులకు కూడా ప్రయత్నం చేసింది. అందుకే బన్నీ వాస్ ఫిర్యాదు మేరకు ఆమెను 3 నెలల పాటు విజయవాడ సబ్ జైలులో శిక్ష వేసారు. ఆ కోపంతో మరింత తీవ్రస్థాయిలో వేధిస్తుంది సునీత. అయినా కూడా ఓపిగ్గా భరిస్తున్న బన్నీ వాస్.. ఈ విషయాన్ని కేవలం చట్ట ప్రకారం మాత్రమే పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. అందుకే న్యాయపరమైన ప్రక్రియను అనుసరిస్తున్నారు.

సునీత బోయ చేసిన ఏ ఆరోపణ తీసుకున్నా కూడా నిరాధారంగా.. అలాగే ఒకదానితో మరోటి సంబంధం లేకుండా ఉంటాయి. రాజకీయాలు, సినిమాలు, ప్రముఖులు, గీతా ఆర్ట్స్ సంస్థ, బన్నీ వాస్‌ గారికి సంబంధించిన ఏ ఇష్యూ తీసుకున్నా కూడా సంబంధం లేకుండా.. తనకు నచ్చినట్లు మాటలు మారుస్తుంటుంది సునీత. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఆమె పోస్ట్ చేసిన అన్ని వీడియోలను చూస్తే ఈ విషయం మీకే అర్థమైపోతుంది. పరిస్థితులకు తగ్గట్లు.. తను ముందు అన్న మాటనే మళ్లీ మార్చి చెప్పడం సునీత బోయకు అలవాటు. ఆమె తప్పుడు స్టేట్‌మెంట్ ఇస్తూ కూడా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. అయినా కూడా ఆమె మాటలు వింటే ఎంత వరకు నిజాలు చెప్తుందో తెలిసిపోతుంది. 

కాబట్టి అందరికీ తెలిపేదేమనగా .. దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులను ప్రోత్సహించొద్దని మనవి. లైమ్ లైట్‌లో ఉండటానికి ఈమె చేసే తప్పుడు ఆరోపణలను మీడియా ఎలాంటి కథనాలను కూడా ప్రచురించవద్దని హృదయపూర్వక విన్నపం. బన్నీ వాస్ గారిపై ఎలాంటి ఆరోపణలు చేయొద్దని.. HRCతో పాటు సంబంధిత గౌరవ విచారణ, జిల్లా హైకోర్టులలో ఈమెకు వార్నింగ్స్ వచ్చాయి. అయినా కూడా పట్టించుకోకుండా అలాగే ఆరోపణలు చేస్తుంది. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆరోపణలు చెప్పినా అలాగే చేయడం అనేది కోర్టు ధిక్కరణే. తీర్పు వచ్చిన తర్వాత కచ్చితంగా మీడియా ముందుకు వచ్చి జరిగిన వాస్తవాలన్నింటిని వివరిస్తాము. అంతేకాదు దీని వెనుక ఉన్న వ్యక్తులపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అంటూ పేర్కొన్నారు. 

Also Read: ఆస్కార్స్ లైవ్‌లో గొడవ, కమెడియన్‌ని కొట్టిన విల్ స్మిత్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
Pawan Kalyan:  పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
Game Changer Box Office Collection Day 1 : రామ్ చరణ్ కెరీర్​లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్... 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
రామ్ చరణ్ కెరీర్​లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్... 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
JC Prabhakar Reddy: నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ కట్టడాలు కూలుస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి 
JC Prabhakar Reddy: నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ కట్టడాలు కూలుస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
Pawan Kalyan:  పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
Game Changer Box Office Collection Day 1 : రామ్ చరణ్ కెరీర్​లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్... 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
రామ్ చరణ్ కెరీర్​లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్... 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
JC Prabhakar Reddy: నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ కట్టడాలు కూలుస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి 
JC Prabhakar Reddy: నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ కట్టడాలు కూలుస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి 
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం, కీలక సూచనలివే
Daaku Maharaaj: తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Vijayawada Highway: సంక్రాంతి ఎఫెక్ట్, హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల మేర వాహనాలు
సంక్రాంతి ఎఫెక్ట్, హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల మేర వాహనాలు
Embed widget