Bagheera Movie: తెలుగులోకి కన్నడలో రోరింగ్ స్టార్ ‘బఘీరా‘..హోంబలే ఫిల్మ్స్ ఖాతాలో మరో ల్యాండ్ మార్క్ హిట్ పడేనా?
Prashanth Neel : కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘బఘీరా‘. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న తెలుగులో విడుదలకాబోతోంది.
Bagheera Release In Telugu : కన్నడ సినిమా పరిశ్రమలో రోరింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నయంగ్ హీరో శ్రీమురళి. ఆయన ప్రధాన పాత్రలో నటించించిన తాజా చిత్రం ‘బఘీరా‘. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ LLP రిలీజ్ చేయబోతోంది. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31 ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల చేయబోతున్నది. త్వరలోనే తెలుగులో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 17న ‘బఘీరా‘ ఫస్ట్ సింగిల్ విడుదల
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. శ్రీమురళి ఈ సినిమాలో ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు అక్టోబర్ 17న ఈ సినిమాకు సంబంధించి ‘రుధిర హర‘ అనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ పాటతో మూవీపై మరిన్ని అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
హోంబలే ఫిల్మ్స్ ఖాతాలో మరో ల్యాండ్ మార్క్ హిట్ పడేనా?
ఈ హైవోల్టేజ్ మూవీకి డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీకి కథను అందించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. ‘కేజీఎఫ్‘, ‘కాంతార‘, ‘సలార్‘ లాంటి సినిమాలను నిర్మించిన సంస్థ నుంచి వస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. హోంబలే ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ సినిమాల లిస్టులో ‘బఘీరా‘ సైతం చేరుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథను అందించడంతో మరింత హైప్ పెరిగింది.
‘కాంతార‘ లాంటి సక్సెస్ రిపీట్ అయ్యేనా?
ఇక ఈ సినిమాలో శ్రీమురళి పవర్ ఫుల్ రోల్ పోషించగా, రుక్మిణి వసంత్, ప్రకాశ్ రాజ్, రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఏ.జే శెట్టి సినిమాటోగ్రఫీ అందించారు. బి అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. రవి సంతేహక్లూ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు.
ఇక ఈ సినిమా కథ, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తాయని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. హొంబలే ఫిల్మ్స్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయం అంటున్నారు. ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంటుందని నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు. అద్భుతమైన యాక్షన్ కథాంశం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెప్పారు. ఈ సినిమా ‘కాంతారా‘ మాదిరగా సంచలన విజయాన్ని అందుకుంటుందన్నారు. త్వరలో ప్రారంభించే ప్రమోషన్ కార్యక్రమాలు సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు.
Also Read: చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?