అన్వేషించండి

Aishwarya Marriage: రెండో పెళ్లికి హీరో కుమార్తె రెడీ - దర్శకుడితో ఐశ్వర్య ప్రేమ!

Prabhu daughter Aishwarya marriage: తమిళ హీరో కుమార్తె ఐశ్వర్య రెండో వివాహానికి రెడీ అయినట్టు కోలీవుడ్ టాక్. ఆమె ఓ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. 

వివాహాలు, విడాకులు... ఇప్పుడు సామాన్యులలోనూ పెరిగాయి. అందుకు చలన చిత్ర ప్రముఖులు ఏమీ అతీతం కాదు. కాకపోతే... చిత్రసీమ ప్రముఖుల వివాహాలు, స్టార్ కపుల్స్ మధ్య గొడవలు, ఆ తర్వాత విడాకులపై సామాన్యుల్లో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. నిండు నూరేళ్లు కలిసి ఉండాలని ఏడు అడుగులు వేసిన జంట... ఆ తర్వాత విడాకులు తీసుకుని, మరో పెళ్లికి రెడీ కావడం తప్పేమీ కాదు. తమిళ సీనియర్ కథానాయకుడు, నటుడు ప్రభు కుమార్తె సైతం రెండో పెళ్లికి రెడీ అవుతున్నారని కోలీవుడ్ టాక్. పూర్తి వివరాల్లోకి వెళితే...  

దర్శకుడి ప్రేమలో ప్రభు కుమార్తె!
తమిళ నటుడు ప్రభు తెలుగు ప్రేక్షకులకు సైతం తెలుసు. ప్రభాస్ 'డార్లింగ్'లో  హీరో తండ్రి పాత్రలో నటించారు. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో హీరోయిన్ కేతికా శర్మ తండ్రిగా కనిపించారు. 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలోనూ నటించారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు తమిళ హీరోల్లో హీరోగా నటిస్తున్నారు. అతని సినిమాలు కొన్ని మన తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యాయి. ప్రభు కుమార్తె విషయానికి వస్తే... ఆమె పేరు ఐశ్వర్య. 

Also Readరష్మిక రాలేదు... కానీ 'గర్ల్ ఫ్రెండ్' మొదలు!

తమిళ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్, ఐశ్వర్య ప్రేమలో ఉన్నారని తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో వాళ్లిద్దరూ ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారని టాక్. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

ఐశ్వర్యకు ఇది రెండో పెళ్లి!
ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'మార్క్ ఆంటోనీ'. విశాల్, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమా తమిళనాట మంచి విజయం సాధించింది. అంతకు ముందు తమిళంలో జీవీ ప్రకాష్ కుమార్, శింబు, ప్రభు దేవా హీరోలుగా సినిమాలు చేశారు. ఓ సినిమా చిత్రీకరణలో ఆయనకు, ఐశ్వర్యకు జరిగిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని... త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్నారని టాక్. 

Also Readయానిమల్ వయలెన్స్... సలార్ యాక్షన్... డిసెంబర్‌లో ధూమ్ ధామ్ థియేటర్లలోకి భారీ అండ్ క్రేజీ సినిమాలు

ఐశ్వర్యకు ఇంతకు ముందు వివాహం జరిగింది. బంధువు కునాల్, ఆమె ఏడు అడుగులు వేశారు. కొన్ని రోజులకు దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో వేరు పడ్డారు. ఇప్పుడు ఆధిక్ రవిచంద్రన్, ఐశ్యర్య ప్రేమకు ఇరువురి కుటుంబ సభ్యులు ఆమోద ముద్ర వేశారని... డిసెంబర్ నెలలో ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారని కోలీవుడ్ ఖబర్. అయితే... ఆ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు. మరి, ఎప్పుడు బయట పెడతారో? 


అజిత్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ సినిమా!
తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith movie with Adhik Ravichandran)కు ఆధిక్ రవిచంద్రన్ డై హార్డ్ ఫ్యాన్. ఇప్పుడు తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నారని తమిళ సినిమా టాక్. త్వరలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Embed widget