అన్వేషించండి

Rashmika The Girlfriend movie: రష్మిక రాలేదు... కానీ 'గర్ల్ ఫ్రెండ్' మొదలు!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రూపొందుతున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా ప్రారంభమైంది.

Rashmika Mandanna new movie The Girlfriend movie launch: రష్మికా మందన్నా నేషనల్ క్రష్! అందం, అభినయం, వ్యక్తిత్వంతో ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకుంటున్నారు. స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లో అభినయానికి ఆస్కారం ఉన్న క్యారెక్టర్లు, గ్లామర్ రోల్స్ చేశారు రష్మిక. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఆవిడ ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ చేస్తన్నారు. ఆ సినిమాను ఈ రోజు పూజతో మొదలు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్ ఫ్రెండ్'
Rahul Ravindran to direct Rashmika: 'అందాల రాక్షసి' నుంచి హీరోగా, నటుడిగా రాహుల్ రవీంద్రన్ పలు సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులను నటనతో మెప్పించారు. 'చిలసౌ'తో దర్శకుడిగా పరిచయమైన ఆయన... మొదటి సినిమాతో విజయం అందుకున్నారు. తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న మూడో సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend Movie).  

'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ సిటీలో లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించారు.

Also Read: యానిమల్ వయలెన్స్... సలార్ యాక్షన్... డిసెంబర్‌లో ధూమ్ ధామ్ థియేటర్లలోకి భారీ అండ్ క్రేజీ సినిమాలు

ఈ కార్యక్రమానికి రష్మిక హాజరు కాలేదు. 'యానిమల్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఆ వేడుకకు హాజరైన రష్మిక... ఈ ప్రోగ్రాంకి డుమ్మా కొట్టారు. 'యానిమల్' ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో రాలేకపోయారని సమాచారం.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

'ది గర్ల్ ఫ్రెండ్' ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా... ప్రముఖ దర్శకుడు మారుతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 'బేబీ'తో భారీ హిట్ అందుకున్న సాయి రాజేశ్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. రెగ్యులర్ చిత్రీకరణ త్వరలో ప్రారంభిస్తామని, వైవిధ్యమైన ప్రేమ కథతో 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Also Readకోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా?

రష్మికా మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కాస్ట్యూమ్స్: శ్రావ్య వర్మ, ప్రొడక్షన్ డిజైన్: ఎస్ రామకృష్ణ & మౌనిక నిగోత్రి, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాతలు: విద్య కొప్పినేని & ధీరజ్ మొగిలినేని, రచన- దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget