By: ABP Desam | Updated at : 27 Nov 2022 02:38 PM (IST)
Edited By: anjibabuchittimalla
Prabhas
పాన్ ఇండియన్ స్టార్ గా వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం దర్శకుడు మారుతితో కలిసి ‘డీలక్స్ రాజా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్లను ఖరారు చేశాడు దర్శకుడు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్ ఇప్పటికే ఓకే కాగా, తాజాగా మరో హీరోయిన్ ఖరారు అయ్యింది. ఆమె మరెవరో కాదు రిధి కుమార్.
ప్రభాస్, మారుతి మూవీ కోసం తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘మాస్టర్’ హీరోయిన్ మాళవిక మోహన్ ఇప్పటికే సైన్ చేసింది. ‘మిస్టర్ మజ్ను’ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కోసం ప్రభాస్ తాజా మూవీ ‘రాధే శ్యామ్’లో నటించిన రిధి కుమార్ సైతం ఓకే అయ్యింది. రిధి కుమార్ 2018 లో దిల్ రాజు మూవీ ‘లవర్’తో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ మూవీలో ఈ అమ్మడు రైలు ప్రమాదంలో చేయి కోల్పోయిన వ్యక్తిగా నటించి మెప్పించింది.
దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ‘రాజా డీలక్స్’ సినిమా హర్రర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోంది. ప్రభాస్ ఒక పాత థియేటర్ లో పాతి పెట్టిన నిధిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఈ సమయంలోనే ఓ కామిక్ దెయ్యం వెంటాడుతుంది. దాని నుంచి తప్పించుకుని నిధిని ఎలా కనుగొంటారు? అనేదే సినిమా కథ అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కథకు సంబంధించి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మొత్తంగా ఓ విభిన్న కథాంశంతో ‘డీలక్స్ రాజా’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. ‘డీలక్స్ రాజా’ సినిమాలో ప్రభాస్ డ్యుయెల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ నటించనున్నారు. అటు మరో దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి ‘ప్రాజెక్ట్ K’లో నటిస్తున్నాడు. ఇందులో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నాడు. ఇక మారుతితో కలిసి ‘డీలక్స్ రాజా’ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: ప్రభాస్ తో తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చర్చలు, భారీ బడ్జెట్ మూవీకి శ్రీకారం!
Brahmamudi February 8th: రాజ్ కి షాకిచ్చిన తల్లి- పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు రానన్న స్వప్న తండ్రి
Sai Dharam Tej: అది నాకు కలిసి రాలేదు, ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లయ్యింది - సాయి ధరమ్ తేజ్ కామెంట్స్
Bedurulanka 2012 Release : ఉగాదికి 'బెదురు లంక 2012' - 'ఆర్ఎక్స్ 100' రేంజ్ హిట్ కావాలి మరి!
Writer Padmabhushan: మహిళలకు ‘రైటర్ పద్మభూషణ్’ బంపర్ ఆఫర్ - ఈ ఒక్కరోజే ఛాన్స్!
Balakrishna - Shiva Rajkumar : బాలకృష్ణతో సినిమా చేయాలని ఉంది - 'వేద' ప్రీ రిలీజ్లో శివ రాజ్ కుమార్
Khammam News: అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి - ఫ్రెండ్స్పై అనుమానం!
YSRCP Politics : జగనన్నకు చెప్పుకుంటే రాత మరిపోతుందా ? కొత్త ప్రోగ్రాంపై వైఎస్ఆర్సీపీ ఆశలు నెరవేరుతాయా ?
Sidharth- Kiara Wedding Pics: అట్టహాసంగా సిద్ధార్థ్, కియారా వివాహ వేడుక
NEET PG 2023: నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్లో మార్పు - తప్పుడు వార్తల్ని నమ్మొద్దంటూ కేంద్రం క్లారిటీ!