News
News
X

Prabhas: ప్రభాస్ తో తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చర్చలు, భారీ బడ్జెట్ మూవీకి శ్రీకారం!

ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తో ఓ సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాతో దేశ, విదేశాల్లో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సహా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. అయినా, ఇంకా కొత్త సినిమాలు చేసేందుకు కథలు వింటున్నాడు. తాజాగా తమిళ హిట్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఓ సినిమా గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించబోతున్నట్లు సమాచారం.

వరుస సినిమాలతో లోకేష్ జోరు

వాస్తవానికి లోకేష్ ఇప్పటి వరకు నిండుగా 5 సినిమాలు కూడా చేయలేదు. కానీ, టాప్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వస్తోంది. కేవలం 5 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన లోకేశ్ తో సినిమాలు చేయాలని స్టార్ హీరోలు సైతం కోరుకుంటున్నారు. కాన్సెప్ట్, కమర్షియల్ అనే తేడా లేకుండా ఏ సినిమా చేసినా సక్సెస్ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. విజయ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. ఖైదీ-2, విక్రమ్-2 సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో బిజీగా ఉంటూనే తెలుగులోనూ సినిమాలు చేసేందుకు వర్కౌట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.   

లోకేష్ తో సినిమాకు ప్రభాస్ ఆసక్తి

ప్రభాస్ కూడా ప్రస్తుతానికి చాలా సినిమాలకు సైన్ చేశాడు. ఆయన లైనప్ చాలా పెద్దగానే ఉంది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అయినా, కనగరాజ్ తో సినిమా చేయాలని ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తనకు తెలుగులో సినిమాలు చేయాలని ఉందని కనగరాజ్ వెల్లడించాడు. ‘మాస్టర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన తెలుగు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. రామ్ చరణ్‌కు స్టోరీ చెప్పినట్లు తెలిపాడు. తన ఆన్సర్ కోసం చూస్తున్నట్లు వివరించాడు. ఆయనతో భారీ బడ్జెట్ తో సినిమా చేస్తానని వెల్లడించాడు. కానీ, ఇప్పటి వరకు ఆ సినిమా గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు.

టాలీవుడ్ మీద లోకేష్ ఫోకస్

తమిళ సినిమా పరిశ్రమలో హిట్ ట్రాక్ ఉన్న కనగరాజ్, ప్రస్తుతం మూడు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. తమిళ నాట సత్తా చాటిన ఆయన ఇప్పుడు తెలుగులోనూ దుమ్మురేపాలని భావిస్తున్నాడు. ఒక వేళ ప్రభాస్ ఈ సినిమాకు ఓకే చెప్తే ఓ రేంజిలో తన సినిమా ఉంటే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు ప్రభాస్, కనగరాజ్ చర్చలకు సంబంధించి ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.  

Read Also: బ్రూస్ లీ వన్ ఇంచ్ పంచ్ కు ప్రపంచం ఫిదా, ఈ పంచ్ ప్రత్యేకత ఏంటి? ఎందుకు వరల్డ్ ఫేమస్ అయ్యింది? దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే?

Published at : 27 Nov 2022 01:10 PM (IST) Tags: Hero prabhas director Lokesh Kanagaraj movie talks

సంబంధిత కథనాలు

K Viswanath Death: సెల్యూట్ టు మాస్టర్ - కళాతపస్వికి కమల్, బాలకృష్ణ, అనిల్ కపూర్ నివాళులు

K Viswanath Death: సెల్యూట్ టు మాస్టర్ - కళాతపస్వికి కమల్, బాలకృష్ణ, అనిల్ కపూర్ నివాళులు

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K Vishwanath Top 10 Movies: విశ్వనాథ్ మరపురాని 10 చిత్రాలివే - గుండె బరువెక్కిస్తాయ్, మనసును హత్తుకుంటాయ్!

K Vishwanath Top 10 Movies: విశ్వనాథ్ మరపురాని 10 చిత్రాలివే - గుండె బరువెక్కిస్తాయ్, మనసును హత్తుకుంటాయ్!

Janaki Kalaganaledu February 3rd: తల్లిదండ్రులకు అబద్ధం చెప్పిన అఖిల్, నిలదీసిన జెస్సి- జ్ఞానంబ ఇంట్లో మలయాళం ఎంట్రీ

Janaki Kalaganaledu February 3rd: తల్లిదండ్రులకు అబద్ధం చెప్పిన అఖిల్, నిలదీసిన జెస్సి- జ్ఞానంబ ఇంట్లో మలయాళం ఎంట్రీ

K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్‌లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!

K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్‌లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!

టాప్ స్టోరీస్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,  ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!