అన్వేషించండి

Radheshyam: 'రాధేశ్యామ్' రిలీజ్ కి ముందే ప్రభాస్ ట్రిప్, ఎక్కడికో తెలుసా?

ఒక్క ఆదివారం రోజునే దాదాపు పది ఛానెల్స్ కి ఓపికగా ఇంటర్వ్యూలు ఇచ్చారు ప్రభాస్. ముంబై, చెన్నై, బెంగుళూరు అంటూ రోజంతా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే ఉన్నారు.

ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను విడుదల చేస్తున్నారు. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. 'రాధేశ్యామ్' టీమ్ మొత్తం దేశం మొత్తం చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో తెలుగు మీడియాకు ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆదివారం టీవీ ఛానెల్స్ కు, సోమవారం పేపర్, వెబ్ సైట్ లకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని షెడ్యూల్స్ కేటాయించారు. 

ఒక్క ఆదివారం రోజునే దాదాపు పది ఛానెల్స్ కి ఓపికగా ఇంటర్వ్యూలు ఇచ్చారు ప్రభాస్. ముంబై, చెన్నై, బెంగుళూరు అంటూ రోజంతా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే ఉన్నారు. చిన్న ఛానెల్స్ కి సైతం ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. గత రెండు, మూడు రోజులుగా గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు ప్రభాస్. నిజానికి ఆయన ఇంత ఓపికగా ఇంటర్వ్యూలు ఇస్తుండడంతో నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు. 

అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలకు ముందే ప్రభాస్ ట్రిప్ కి వెళ్లపోతున్నారని తెలుస్తోంది. ఢిల్లీ, కేరళలో ప్రెస్ మీట్స్ ఉన్నాయి. అవి పూర్తయిన తరువాత హాలిడే కోసం యూరప్ వెళ్లాలనుకుంటున్నారు ప్రభాస్. 'రాధేశ్యామ్' సినిమా రిజల్ట్ వచ్చే సమయానికి ఆయన హాలిడే స్పాట్ లో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. 'సాహో' సినిమా రిలీజ్ సమయంలో కూడా ప్రభాస్ ఇలానే చేశారు. సినిమా విడుదలకు ముందే  ఫారెన్ వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వబోతున్నారు.

పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ  సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

View this post on Instagram
 
A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget