Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!
కృష్ణంరాజు సినిమాల్లో కొన్ని సన్నివేశాలను ప్రభాస్ సినిమాల్లో సన్నివేశాలతో పోలుస్తూ వీడియోను డిజైన్ చేశారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించి కొన్ని రోజులు గడిచిపోయింది. ఆయన మరణాన్ని ప్రభాస్ అండ్ ఫ్యామిలీ తట్టుకోలేకపోతున్నారు. దీని నుంచి కోలుకోవడానికి వారికి మరింత సమయం పడుతుంది. ప్రభాస్ ని నమ్ముకొని ఉన్న నిర్మాతల కోసం ఆయన తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభాస్ అభిమానుల్లో ఒకరు కొలాజ్ వీడియోను రూపొందించారు. ఇందులో కృష్ణంరాజు సినిమాల్లో కొన్ని సన్నివేశాలను ప్రభాస్ సినిమాల్లో సన్నివేశాలతో పోలుస్తూ వీడియోను డిజైన్ చేశారు.
ఈ వీడియో ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. చివరకు ప్రభాస్ వరకు ఈ వీడియో వెళ్లడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా దీన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో ఎమోషనల్ గా ప్రభాస్ కి కనెక్ట్ అయింది. అందుకే ఆయన తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. సాధారణంగా ప్రభాస్ ఇలాంటి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, వీడియోలను ఎప్పుడూ షేర్ చేయలేదు. కానీ తన పెదనాన్నకు సంబంధించిన వీడియో కావడంతో ఆయన గుర్తుగా తన అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ:
ఇప్పుడు ప్రభాస్ సెప్టెంబర్ 28న మొగల్తూరుకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ కృష్ణంరాజు సంస్మరణ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు ఫ్యామిలీ కూడా మొగల్తూరుకి వెళ్లనుంది. వీరంతా కొన్నిరోజులు పాటు అక్కడే ఉండనున్నారు. అందుకే అక్కడ ఉన్న వారి ఇంటిని రెన్నోవేట్ చేయిస్తున్నారు. దాదాపు 50 మంది పనివాళ్లు ఇంటి కోసం పని చేస్తున్నారు. గత 12 ఏళ్లలో ప్రభాస్ తొలిసారి మొగల్తూరుకి వెళ్తున్నారు. 2010లో ప్రభాస్ తండ్రి మరణించినప్పుడు మొగల్తూరుకి వెళ్లారు. కృష్ణంరాజు మాత్రం ఏడాది కనీసం రెండుసార్లైనా.. తన సొంతూరికి వెళ్లేవారు. కోవిడ్ సమయంలో మాత్రం వెళ్లడానికి కుదరలేదు.
ఇక మొగల్తూరులో కృష్ణంరాజు స్మారక సభ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నారు. దాదాపు 70 వేల మందికి భోజనం ఏర్పాట్లు చేయిస్తున్నారు. ద్రాక్షారామంకి చెందిన కొందరు చెఫ్ లను ఈ టాస్క్ కోసం నియమించారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణంరాజు అంత్యక్రియల సమయంలో కూడా చివరిచూపు కోసం వచ్చిన అభిమానులందరికీ భోజనం పెట్టించి మరీ పంపించారు ప్రభాస్. ఇప్పుడు మరోసారి అభిమానుల కోసం భోజనం ఏర్పాట్లు చేయిస్తున్నారు.
Also Read : బాబాయ్ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానా నాయుడు' టీజర్ రిలీజ్
Also Read : లక్ష్మీ మంచు ఈజ్ బ్యాక్ - త్వరలో 'షెఫ్ మంత్ర 2' షురూ!
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'సలార్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరిన్ని సినిమాలు ఒప్పుకున్నారు. ఇప్పటికే 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారు. మరోపక్క నాగ్ అశ్విన్ డైరెక్ట్ డైరెక్ట్ చేస్తోన్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యారు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.