అన్వేషించండి

Prabhas Project K Shooting Update : ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' @ టెంపుల్ సెట్!

ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. సినిమా కోసం టెంపుల్ సెట్ వేశారు.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ కె' (Project K Movie) ఒకటి. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ఇప్పటి వరకు తెలుగు తెరపై, ఆ మాటకు వస్తే భారతీయ తెరపై రానటువంటి కథాంశంతో సినిమా రూపొందుతోందని తెలిసింది. ప్రభాస్ పుట్టినరోజు బహుమతిగా ఆయన అభిమానులకు చిత్ర బృందం ఓ చిరు కానుక ఇచ్చారు.
 
Prabhas Pre Look Project K Movie : 'ప్రాజెక్ట్ కె' నుంచి ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేసిన పోస్టర్ చూస్తే... అందులో కేవలం చెయ్యి మాత్రమే ఉంటుంది. అది చూస్తే... ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నట్లు సులభంగా అర్థం అవుతోంది. సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ స్టోరీలో భారతీయ పురాణ ఇతిహాసాలకు కూడా చోటు ఉంటుందని సమాచారం.
 
Temple Set For Project K Shooting : ప్రస్తుతం 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ ఓ టెంపుల్ సెట్‌లో జరుగుతోంది. హైదరాబాద్ నగర శివార్లలో ప్రభాస్ సినిమా కోసమే ప్రత్యేకంగా సెట్ వేశారు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతోన్న సినిమా షూటింగులు స్టూడియోల్లో జరుగుతాయి. ఈ మధ్య కొత్తగా నగర శివార్లలోని స్థలాల్లో సెట్స్ వేసి చేస్తున్నారు. అదే విధంగా 'ప్రాజెక్ట్ కె' కోసం టెంపుల్ సెట్ వేశారు.

గుడిలో సూపర్ హీరో ఏం చేస్తున్నాడు? అనేది ఆసక్తికరం! ప్రస్తుతానికి 'ప్రాజెక్ట్ కె' కథకు సంబంధించి ఎటువంటి విషయాలను బయటకు రానివ్వకుండా యూనిట్ జాగ్రత్త పడుతోంది.

Also Read : 'రామ్ సేతు' రివ్యూ : అక్షయ్ కుమార్‌కు శ్రీరాముడు విజయాన్ని అందించాడా? సత్యదేవ్‌ ఎలా చేశారు?

'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ, పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకోన్ (Deepika Padukone) కథానాయికగా నటిస్తున్నారు. బీ టౌన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తున్నారు. మరో బాలీవుడ్ హీరోయిన్, తెలుగులో వరుణ్ తేజ్ 'లోఫర్' సినిమాలో కథానాయికగా నటించిన దిశా పటానీ కూడా ఓ పాత్ర చేస్తున్నారు. 

'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఎవడే సుబ్రమణ్యం', 'మహానటి' చిత్రాల తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇది పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ మూవీ అని ఆయన చెబుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

అక్టోబర్ 18, 2023న... ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయడం కుదరకపోతే 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నట్లు అశ్వినీదత్ వెల్లడించారు.

'ప్రాజెక్ట్ కె' కంటే ముందు 'ఆదిపురుష్' సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న 'సలార్', మారుతి దర్శకత్వంలో చేయబోయే హారర్ కామెడీ సినిమాలు కూడా లైనులో ఉన్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget