Prabhas: స్పెయిన్ లో ప్రభాస్ కి సర్జరీ, అసలేమైందంటే?
'రాధేశ్యామ్' సినిమా పూర్తి కావడంతో ఇప్పుడు 'సలార్' సినిమాతో బిజీగా ఉన్నారు ప్రభాస్.
![Prabhas: స్పెయిన్ లో ప్రభాస్ కి సర్జరీ, అసలేమైందంటే? Prabhas On Spanish Vacation, Undergoes Minor Surgery For Salaar Injury Prabhas: స్పెయిన్ లో ప్రభాస్ కి సర్జరీ, అసలేమైందంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/19/93d16352eb172cf72762a5285b9cbeb1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో ఆశించిన స్థాయిలో సినిమా కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించిన ఓ విషయం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ప్రభాస్ షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యారట.
'రాధేశ్యామ్' సినిమా పూర్తి కావడంతో ఇప్పుడు 'సలార్' సినిమాతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కి గాయాలయ్యాయని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం 'సలార్' సినిమా షూటింగ్ లో ప్రభాస్ గాయపడ్డట్లు చెబుతున్నారు. చిన్న ఆపరేషన్ అవసరం కూడా ఉందట.
దీంతో ప్రభాస్ స్పెయిన్ లో ఆపరేషన్ చేయించుకున్నారు. సర్జరీ చిన్నదే అయినప్పటికీ డాక్టర్స్ విశ్రాంతి తీసుకోమని చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 'సలార్'తో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ రూపొందిస్తోన్న 'ప్రాజెక్ట్ K' సినిమాల్లో నటిస్తున్నారు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్'ను కూడా ఈ ఏడాదిలోనే మొదలుపెట్టాలని చూస్తున్నారు. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
Also Read: 'పెన్నీ సాంగ్' ప్రోమో, ఫ్యాన్స్ కి మహేష్ బాబు సర్‌ప్రైజ్
Also Read: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూట్యూబర్ మృతి, షణ్ముఖ్ ఎమోషనల్ పోస్ట్
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)