Gayathri: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూట్యూబర్ మృతి, షణ్ముఖ్ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ యూట్యూబర్, నటి గాయత్రి శుక్రవారం రాత్రి గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో మరణించింది.

ప్రముఖ యూట్యూబర్, నటి గాయత్రి శుక్రవారం రాత్రి గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో మరణించింది. హోలీ వేడుకల్లో పాల్గొన్న తరువాత విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా.. కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పై బోల్తా పడింది. ఈ ఘటనలో గాయత్రి అక్కడికక్కడే కన్నుమూసింది. కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న రోహిత్ కి తీవ్ర గాయాలు కావడంతో అతడిని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. నిన్న హోలీ పండగ నేపథ్యంలో గాయత్రి ఇంటికి వెళ్లి ఆమెని పిక్ చేసుకున్న రోహిత్ అక్కడ నుంచి ప్రిజం పబ్ కి వెళ్లారు.
అక్కడ పార్టీ చేసుకున్న తరువాత ఇద్దరూ కారులో బయలుదేరి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో గాయత్రి కారుని డ్రైవ్ చేయగా.. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఆమె మారణవార్త విన్న పలువురు సినీ నటులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గాయత్రితో ఉన్న ఓ ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది.
'ఇది చాలా అన్యాయం.. నమ్మడానికి కష్టంగా ఉంది. నీతో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు మాటలు రావడం లేదు' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. షణ్ముఖ్ సైతం గాయత్రితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. హార్ట్ బ్రేక్ సింబల్ ను జత చేశారు.
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















