అన్వేషించండి

Kalki 2898 AD: ప్రభాస్ క్యారెక్టర్ చనిపోతుంది, కల్కి 2898 AD సీక్వెల్‌పై మహాభారత్ సీరియల్ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kalki 2898 AD Movie Collections: కల్కి 2898 AD సీక్వెల్‌పై మహాభారత్‌ సీరియల్ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ పాత్ర చనిపోతుందని చెప్పారు.

 Kalki 2898 AD Sequel: కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఈ వసూళ్ల సంగతి ఎలా ఉన్నా ఈ మధ్య కాలంలో ఏ సినిమాపై రానన్ని థియరీలు ఈ మూవీపై వచ్చాయి. సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ జరుగుతోంది. మహాభారతంలో లేనిది చూపించారని కొందరు, పర్‌ఫెక్ట్ అడాప్షన్‌ అని మరి కొందరు వాదిస్తున్నారు. ఇప్పుడు మహాభారత్ టీవీ షో యాక్టర్ నితీశ్ భరద్వాజ్‌ ఈ సినిమాపై స్పందించారు. మహాభారతంలోని పాత్రల్ని చాలా తెలివిగా వాడుకున్నాడని, వాటి ద్వారా కల్కి అవతారం గురించి చెప్పాడని ప్రశంసించారు. అంతే కాదు. బాలీవుడ్ ప్రొడ్యూసర్‌లు (Kalki 2898 AD) దక్షిణాదిని చూసి నేర్చుకోవాలని చురకలు అంటించారు. పరోక్షంగా ఆదిపురుష్‌పై సెటైర్లు వేశారు. మన సంస్కృతిలో భాగమైన పురాణాలను, ఇతిహాసాలను ఏ మాత్రం చెడగొట్టకుండా అద్బుతంగా సినిమాలు తీస్తున్నారంటూ సౌత్‌ ఇండస్ట్రీని మెచ్చుకున్నారు. " Mad Max మూవీస్‌ నుంచి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇన్‌స్పైర్‌ (Nag Aswin) అయి కల్కి 2898 AD సినిమా తీసినప్పటికీ పురాణాలను లింక్ చేస్తూ స్క్రీన్‌ప్లే నడిపించారు. సెట్టింగ్‌లతో పూర్తిగా ఇది పురాణాలకు సంబంధించిన కథే అన్నట్టుగా తెలివిగా మలిచారు. ఫిక్షన్‌ని, పురాణాలను కలపి కొత్తగా ప్రెజంట్ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్ అయ్యారు" అని ప్రశంసలు కురిపించారు.  

కల్కి 2898 AD సీక్వెల్‌ గురించీ నితీశ్ భరద్వాజ్ మాట్లాడారు. రెండో పార్ట్‌లో కర్ణుడిగా నటించిన ప్రభాస్ పాత్ర (Prabhas) చనిపోతుందని అంచనా వేశారు. కర్ణుడికి అశ్వత్థాముడు, కృష్ణుడు కలిసి విముక్తి కలిగించినట్టుగా డైరెక్టర్ కథను మలుస్తుండొచ్చని అన్నారు. అలా కర్ణుడి పాత్రకు ఓ జస్టిఫికేషన్ ఇస్తుండొచ్చని ఊహించారు. కృష్టుడి ముఖాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదని, తాను నటించేందుకు సిద్ధంగానే ఉన్నానని అన్నారు. ఈ సినిమాలో నటించాలనుందని ఇలా ఇండైరెక్ట్‌గా చెప్పారు. 

కృష్టుడి ఫేస్‌ ఎందుకు చూపించలేదు..? 

సినిమాలో కృష్ణుడి ముఖాన్ని ఎక్కడా రివీల్ చేయలేదు డైరెక్టర్ నాగ్ అశ్విన్. దీనిపై చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. కృష్ణుడిని మిస్టీరియస్‌గా చూపించాలనే ఉద్దేశంతోనే అలా ఎవరన్నది చూపించకుండా దాచేశామని వివరించారు. ఎవరనేది చెప్పేస్తే అది కూడా ఓ క్యారెక్టర్‌గా అయిపోతుందని, అలా కాకుండా మిస్టీరియస్‌గా ఉంచుతూనే కృష్ణుడి గొప్పదనాన్ని చూపించాలనుకున్నామని నాగ్ అశ్విన్ చెప్పారు. 

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన కల్కి 2898 AD సినిమా కోసం రూ.600 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. మరి కొద్ది రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్‌ని (Kalki 2898 AD Collections) టచ్‌ చేసేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మైథాలజీని, సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, శోభన కీలక పాత్రల్లో నటించారు. 

Also Read: Indian 2: అందుకే రహమాన్‌ని కాదని అనిరుధ్‌ని పెట్టుకున్నాం, విమర్శలపై శంకర్ క్లారిటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget