అన్వేషించండి

Abundance in Millets : ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్‌’- గ్రామీ అవార్డుకు మోడీ సాంగ్ నామినేట్

ప్రధాని మోడీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఆయన మాటలు అందించిన ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాట గ్రామీ 2024 నామినేషన్ దక్కించుకుంది.

గ్లోబల్ లీడర్ నరేంద్ర మోడీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆయన ఏం చేసినా విశ్వ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఆయన పాడిన పాట తాజాగా అరుదైన నామినేషన్ ను దక్కించుకుంది. గాయకులు ఫాలు, గౌరవ్ షాతో కలిసి ప్రధాన మంత్రి మోదీ రూపొందించిన  'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' సాంగ్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో భాగంగా గ్రామీ 2024 అవార్డు కోసం నామినేషన్ అందుకుంది. ఈ ఏడాది మార్చిలో గ్లోబల్ మిల్లెట్స్  కాన్ఫరెన్స్‌ ను ప్రారంభించిన సందర్భంగా మోదీ ప్రసంగంలోని కొన్ని మాటలను ఈ పాటలో చేర్చారు.  తృణ ధాన్యాల గొప్పదనాన్ని వివరించిన సాంగ్

‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాట జూన్ 16న రిలీ అయ్యింది. ప్రపంచ ఆహార సరఫరాలో మిల్లెట్ ఇంపార్టెన్స్ ను ఈ పాట హైలెట్ చేస్తుంది.  ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పాట విడుదలకు ముందుకు ఫాలు కీలక విషయాలు వెల్లడించారు. అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ పాటను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇందులో ప్రధాని మోడీ కనిపిస్తారని వెల్లడించారు.

మిల్లెట్స్ పై పాటను రూపొందించాలని కోరిన ప్రధాని

ఫాలుకి 2022లో గ్రామీ అవార్డు లభించింది. కలర్‌ ఫుల్ వరల్డ్ కోసం బెస్ట్ చిల్డ్రన్స్ ఆల్బమ్ విభాగంలో ఈ అవార్డును అందుకుంది. ఈ అవార్డు తీసుకున్న తర్వాత ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగానే మిల్లెట్స్ పై ఒక పాటను రూపొందించాలని ప్రధాని చెప్పారు. “మిల్లెట్స్ పై పాటలో మోడీని భాగం చేయాలని అనుకున్నాం. అందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే, ప్రధానితో కలిసి పాట రాసేందుకు మొదట మేం భయపడ్డాం. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశాం. పాట మధ్యలో ప్రధాని మాటలను పొందు పరిచాం. అవే పాటకు హైలెట్ గా నిలిచాయి” అని  ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ సాంగ్ రిలీజ్‌ ఫాలు షా దంపతులు వెల్లడించారు. 2023 సంవత్సరాన్ని  అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ పాటను రూపొందించారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌ లో వచ్చే ఏడాది జనవరి 31న గ్రామీ అవార్డుల వేడుక జరగనుంది.  ఈ ఈవెంట్‌ను దక్షిణాఫ్రికా హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ ట్రెవర్ నోహ్ హోస్ట్ చేయనున్నారు. ఈ అవార్డుల విజేతలు ఎవరు అవుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మిల్లెట్ ఫుడ్స్ ను చాలా కాలంగా ప్రమోట్ చేస్తున్న ప్రధాని

ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటి నుంచి మిల్లెట్స్ ను బాగా తీసుకోవాలని పౌరులను ప్రోత్సహిస్తున్నారు. వాటితో మంచి ఆరోగ్యం లభిస్తుందని పదే పదే గుర్తు చేస్తున్నారు.  పార్లమెంట్ క్యాంటీన్‌లోనూ మిల్లెట్స్‌ తో కూడిన స్పెషల్ వంటకాలు చేయిస్తున్నారు. విదేశీ అతిథులు భారత్ కు వచ్చినప్పుడు కూడా ఆయన మిల్లెట్స్ తో చేసిన ఫుడ్స్ రుచి చూపిస్తున్నారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న మిల్లెట్స్ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాటకు తన మాటలను అందించారు. ఇప్పుడు ఆ పాట గ్రామీ అవార్డుకు నామినేట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Read Also: నిర్వాహకుల అత్యుత్సాహం, అల్లు అర్జున్​కు ట్రోలింగ్ తలనొప్పి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Embed widget