NBK107: బాలయ్యతో దునియా విజయ్, టెరిఫిక్ లుక్ లో స్టార్స్
ఈరోజు ఉగాది సందర్భంగా బాలయ్యకు విషెస్ చెబుతూ పూల బొకేను అందించారు దునియా విజయ్.
'అఖండ' సినిమాతో సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో బాలయ్య లుక్ ని సైతం రివీల్ చేశారు. మాస్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య.
ఈ సినిమాలో తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కొంతమంది నటులను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి తారలు ఉన్నారు. కథ ప్రకారం.. దునియా విజయ్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య - దునియా విజయ్ ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు.
ఇదిలా ఉండగా.. ఈరోజు ఉగాది సందర్భంగా బాలయ్యకు విషెస్ చెబుతూ పూల బొకేను అందించారు దునియా విజయ్. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో బాలయ్య, దునియా విజయ్ సినిమాలో గెటప్స్ తో కనిపిస్తున్నారు. వీరిద్దరి లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే ఈగో వార్ నేపథ్యంలో సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ బాలకృష్ణ టైటిల్ చివర్లో కులం ట్యాగ్స్ ఉండకూడదని చెప్పారట. దీంతో కొత్త టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు.
Also Read: ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే?
Also Read: ఎట్టకేలకు 'భీమ్లానాయక్' సినిమాపై రియాక్ట్ అయిన నిత్యామీనన్
Wishing everyone a happy and prosperous Yugadi 😊🎋#NandamuriBalakrishna #NBK107 @megopichand @MythriOfficial pic.twitter.com/wm27NOwubb
— Duniya Vijay (@OfficialViji) April 2, 2022
View this post on Instagram