Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

బిగ్ బాస్ ఓటీటీ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. మరో రెండు రోజుల్లో విన్నర్ తేలిపోనున్నారు.

FOLLOW US: 

బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం సాయంత్రానికి తెలుగు ఓటీటీ తొలి విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈలోపే అనేక అంచనాలు, అనధికరిక సర్వేలు జరుగుతున్నాయి. హౌస్‌లో ఉన్న వారిలో అఖిల్ - బిందు మాధవి మధ్యే ప్రధాన పోరు స్పష్టంగా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఓట్ల తేడా కూడా చాలా స్వల్పంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓరోజు అఖిల్ టాప్ లో ఉంటే మరో రోజు బిందు మాధవి పుంజుకుంటోంది. గత సీజన్లన్నింటిలోనూ విన్నర్ ఎవరో స్పష్టంగా ప్రేక్షకులు ఊహించగలిగారు కానీ ఈసారి మాత్రం అంచనా వేయడం కష్టంగా మారింది. అఖిల్ -బిందుల మధ్య చాలా టఫ్ ఫైట్ కొనసాగుతోంది.

పాయల్ మద్దతు
బిందు మాధవికి మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన మద్దతును ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ‘నువ్వు టైటిల్ అందుకునేందుకు అర్హురాలివి’ అని కామెంట్ పెట్టింది. దీన్ని చూసి ఆమె అభిమానులు బిందు మాధవికి ఓట్లేసే అవకాశం ఉంది. పాయల్ రాజ్ పుత్ మాత్రమే కాదు, కొన్ని రోజుల క్రితం వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా బిందు మాధవికి మద్దుతుగా స్టేజ్ మీదకు వచ్చింది. అయితే బిందుకు తెలుగులో అంతకుముందు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. అఖిల్ బిగ్ బాస్ 4లో రన్నరప్ గా నిలిచాడు. అప్పట్నించి అతడికి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కొనసాగుతోంది. బిందుమాధవి ఈ షో ద్వారానే అభిమానులను సంపాదించుకుంది. 

అప్పుడు అభి ఇప్పుడు బిందు 
అఖిల్‌కు బిగ్‌బాస్ 4లో అభిజిత్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అభిజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు అఖిల్ తలొగ్గక తప్పలేదు. ఈసారైనా బిగ్ బాస్ ట్రోఫీ ఎత్తుదామన్న అతని కలకు బిందు మాధవి అడ్డుపడేలా ఉంది. కారణం బిందు అభిజిత్ లాగే మైండ్ గేమ్ ఆడుతోంది. మాట్లాడే పద్దతి, ఒంటరిగా సమస్యలను ఎదుర్కొనే సమర్థత అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా హౌస్ లో ఉన్నవారిలో ఇద్దరూ ముగ్గురూ తప్ప అందరూ ఆమెను ఏదో ఒక విషయంలో టార్గెట్ చేసి హైలైట్ చేశారు. అందువల్లే ప్రేక్షకులకు బిందుపై సింపథీ కూడా కలిగింది. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ బిందును అన్న మాటలు ఆయనపై కోపాన్నే కాదు బిందుకి సింపథీనితెచ్చిపెట్టాయి. ఇంతవరకు ఒక ఆడపిల్ల కూడా ట్రోఫీని గెలవలేదు. శ్రీముఖి రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ సెంటిమెంట్ తో బిందుకు ట్రోఫీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

Also read: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?

Also read: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

Published at : 20 May 2022 04:45 PM (IST) Tags: Biggboss OTT Payal Rajputh Bindu Madhavi Akhil Biggboss Bindu Biggboss

సంబంధిత కథనాలు

Karthika Deepam  జులై 1 ఎపిసోడ్:  హిమని అపార్థం చేసుకుని మోనితతో పోల్చిన శౌర్య, మనసు మార్చుకోని డాక్టర్ సాబ్

Karthika Deepam జులై 1 ఎపిసోడ్: హిమని అపార్థం చేసుకుని మోనితతో పోల్చిన శౌర్య, మనసు మార్చుకోని డాక్టర్ సాబ్

Devatha July 1st (ఈరోజు) ఎపిసోడ్: దేవి తండ్రి ఆదిత్య అంటు అసలు నిజం చెప్పేసిన రుక్ముణి- షాక్‌లో అక్కా చెల్లెళ్లు

Devatha July 1st (ఈరోజు) ఎపిసోడ్: దేవి తండ్రి ఆదిత్య అంటు అసలు నిజం చెప్పేసిన రుక్ముణి- షాక్‌లో అక్కా చెల్లెళ్లు

Guppedantha Manasu జులై 1ఎపిసోడ్: రిషిని వసు రిజెక్ట్ చేసిన వీడియో ప్లే చేసేశారు, దేవయాని-సాక్షి కి వసుధార ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి!

Guppedantha Manasu జులై 1ఎపిసోడ్:  రిషిని వసు రిజెక్ట్ చేసిన వీడియో ప్లే చేసేశారు, దేవయాని-సాక్షి కి వసుధార ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్  ఏంటి!

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!

అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!

టాప్ స్టోరీస్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - స్పాట్‌లో ఇద్దరు వ్యక్తులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - స్పాట్‌లో ఇద్దరు వ్యక్తులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల