BRO Teaser: ‘కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం’ - పవర్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చే ‘బ్రో’ టీజర్!
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల ‘బ్రో’ సినిమా టీజర్ విడుదల అయింది.
BRO Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌లు మొదటిసారి నటిస్తున్న సినిమా ‘బ్రో’. తమిళ దర్శకుడు పి.సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జులై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. మోస్ట్ అవైటెడ్ ‘బ్రో’ టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.
ఇక టీజర్ విషయానికి వస్తే... పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చేలా ఈ టీజర్‌ను కట్ చేశారు. ‘తమ్ముడు’ సినిమాలో రైల్వే కూలీ గెటప్‌ను రీక్రియేట్ చేశారు. కాలం గురించి పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. ‘కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం’ అంటూ పవన్ కళ్యాణ్ తన మార్కు డైలాగ్ డెలివరీతో చెప్తుంటే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ రావడం గ్యారంటీ. ప్రస్తుతానికి సినిమాలో యాక్షన్ యాంగిల్ ఏమీ రివీల్ చేయలేదు. మరి సినిమాలో ఏమైనా యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయో లేదో తెలియాలంటే మిగతా కంటెంట్ వచ్చే దాకా వెయిట్ చేయాలి. సాయి ధరమ్ తేజ్ కూడా తన గత సినిమాల కంటే చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
టీజర్ చూడటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్
'బ్రో' సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. ఆ పాటలో మామా అల్లుళ్లతో కలిసి ఆమె స్టెప్పులు వేయడం విశేషం. మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య'లో ‘బాస్ పార్టీ’ సాంగ్‌లో కూడా ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేశారు. ఆ తర్వాత అఖిల్ అక్కినేని 'ఏజెంట్'లో కూడా స్పెషల్ సాంగ్ చేశారు. అలాగే సెప్టెంబర్ 15వ తేదీన రానున్న రామ్, బోయపాటి శ్రీను సినిమాలో కూడా ఒక సాంగ్ చేశారు.
'బ్రో' స్పెషల్ సాంగ్ కోసం గట్టిగా ఖర్చు పెట్టారని సమాచారం. ఊర్వశి రౌతేలా ఒక్కో పాటకు మినిమమ్ రూ. 50 లక్షలు తీసుకుంటారని టాక్. ఊర్వశి రౌతేలా రెమ్యూనరేషన్ కంటే నాలుగైదు రేట్లు పాట కోసం ఖర్చు పెట్టారని తెలిసింది. సెట్ దగ్గర నుంచి లైటింగ్ వరకు ఏ విషయంలోనూ నిర్మాతలు కాంప్రమైజ్ కావడం లేదని వినికిడి.
పవన్ కళ్యాణ్, ఊర్వశి రౌతేలా కనిపించనున్న ప్రత్యేక గీతంలో లైటింగ్ హైలైట్ అవుతుందని తెలుస్తోంది. కేవలం ఒక్క రోజు లైటింగ్ కోసమే రూ. 75 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అది ఎలా ఉంటుందో సినిమా విడుదలైన తర్వాత మాత్రమే తెలుసుకోగలం. ఎలా లేదన్నా కేవలం ఈ ఒక్క పాట కోసమే సుమారు రూ. మూడు కోట్లు ఖర్చు అయిందని టాక్.
'బ్రో' ప్రత్యేక గీతంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లతో ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేయనున్నారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ కలసి స్టెప్పులు వేసిన 'ఖజరారే... ఖజరారే...' తరహాలో ‘బ్రో’ సాంగ్ ఉంటుందట.
మాస్ మహారాజా రవితేజ 'శంభో శివ శంభో', నేచురల్ స్టార్ నాని 'జెండా పై కపిరాజు' చిత్రాల తర్వాత తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహించిన సినిమా 'బ్రో'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూలై 28వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.