Pathaan Telugu Trailer : యాక్షన్‌తో కుమ్మేసిన 'పఠాన్' - షారుఖ్ కొత్త సినిమా ట్రైలర్ వచ్చేసిందోచ్
షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'పఠాన్'. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'పఠాన్' (Pathaan Movie). ఇందులో దీపికా పదుకోన్ (Deepika Padukone) నాయిక. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా 'వార్' తీసిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమా చుట్టూ విపరీతమైన వాదనలు నెలకొన్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఖాన్ హీరోలపై సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'పఠాన్'ను, షారుఖ్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపు ఇస్తున్నారు. 'బేషరమ్ రంగ్...' పాటలో దీపిక పదుకోన్ కాషాయం రంగు బికినీ ధరించడం కూడా వివాదానికి దారి తీసింది. మరోవైపు సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయడం... ఒక్కటి కాదు, 'పఠాన్' ఎప్పుడూ పబ్లిక్‌లో ఉంటోంది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది ఎలా ఉంది? అనేది ఓసారి చూస్తే...
Pathaan Trailer Review : 'పఠాన్' ట్రైలర్ విషయానికి వస్తే... జాన్ అబ్రహం ఒక పోలీస్ కార్ మీద రాకెట్ లాంచ్ బాంబు షూట్ చేయడంతో స్టార్ట్ అయ్యింది. ఒక ప్రయివేట్ టెర్రర్ టీమ్ ఇండియా మీద భారీ ఎత్తున ఎటాక్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయం తెలిసిన ఇంటిలిజెన్స్ గ్రూప్ అజ్ఞాతవాసంలో ఉన్న గూఢచారి 'పఠాన్' (షారుఖ్ ఖాన్)ను రమ్మంటుంది. యాక్షన్.. యాక్షన్.. యాక్షన్... ట్రైలర్ మొత్తం యాక్షన్ ఉంది. హెలికాఫ్టర్ డ్రైవ్ చేస్తూ షారుఖ్ షూట్ చేసే విజువల్స్, ట్రైలర్ ఎండింగ్ హైలైట్ అని చెప్పాలి.
Wishing the whole team of #Pathaan all the very best!@iamsrk Sir looking fwd to seeing you in action sequences like never before! #PathaanTrailerhttps://t.co/63G1CC4R20 @deepikapadukone | @TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/MTQBfYUfjg
— Ram Charan (@AlwaysRamCharan) January 10, 2023
షారుఖ్ మాత్రమే కాదు, దీపికా పదుకోన్ కూడా సోల్జర్ రోల్ చేశారు. ''నేను కూడా సోల్జర్. నీలాగా! మనం ఈ మిషన్ కలిసి చేద్దాం! నువ్వు ఈ మిషన్ లో ఉన్నావా? లేవా?'' అని దీపికా పదుకోన్ చెప్పే డైలాగ్ వింటుంటే... ఆవిడ రోల్ కూడా సూపర్బ్ ఉంటుందని అర్థం అవుతోంది.
అతిథి పాత్రలో రణ్‌వీర్ సింగ్?
'పఠాన్' ప్రచార చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న మరో అంశం... హిందీ హీరో రణ్‌వీర్ సింగ్!?. అవును... ఆయన ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్నారని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు. ట్రైలర్ స్టార్టింగ్ వచ్చిన ఓ వ్యక్తి రణ్‌వీర్ జిరాక్స్ కాపీలా ఉండటంతో ఆయన కూడా సినిమాలో ఉన్నారని ట్వీట్లు చేశారు. అయితే, అతడు రణ్‌వీర్ కాదు. ప్రస్తుతానికి ఆ క్యారెక్టర్ ఏంటనేది సస్పెన్స్.
Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?
తెలుగులోనూ జనవరి 25న విడుదల
'పఠాన్' సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. స్పై ఫిల్మ్ అని చెప్పవచ్చు. షారుఖ్ గూఢచారిగా కనిపించనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో జనవరి 25న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. పాటలతో పాటు టీజర్, ట్రైలర్‌ను మూడు భాషల్లో విడుదల చేశారు.
'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాల్లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ జోడీ నటించింది. మొదటి రెండు సినిమాల్లో వాళ్ళ కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. 'పఠాన్'లోనూ షారుఖ్, దీపిక ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉన్నారు.
Also Read : జనవరిలో తెలుగు థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏవో చూడండి