Pathaan New Song OUT : కుమ్మేసే 'పఠాన్' - షారుఖ్ కొత్త పాటలో ఆ రంగుల్లేవ్
Shah Rukh Khan and Deepika Padukone's Kummese Pathaan Song : షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన 'పఠాన్' సినిమాలో కొత్త పాట ఈ రోజు విడుదలైంది. ఈసారి వివాదాలకు దూరంగా సాంగ్ ఉండటం గమనార్హం.
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కథానాయకుడిగా నటించిన 'పఠాన్' నుంచి ఈ రోజు కొత్త పాట విడుదలైంది. సినిమాలో ఇది రెండో పాట. ఇంతకు ముందు 'బేషరమ్ రంగ్...' సాంగ్ విడుదల చేశారు. అందులో దీపికా పదుకోన్ ధరించిన దుస్తుల రంగు వివాదాస్పదమైంది. ఈ రోజు విడుదలైన 'జూమే జో పఠాన్...' చూస్తే అటువంటి వివాదాలు ఏమీ రాకపోవచ్చని చెప్పవచ్చు. దుస్తుల రంగు విషయంలో జాగ్రత్త పడినట్టు కనబడుతోంది.
కుమ్మేసే పఠాన్...
'పఠాన్'ను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కంటే ఒక్క రోజు ముందు జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాటలను కూడా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.
'కుమ్మేసే పఠాన్...' అంటూ రెండో పాటను తెలుగులో విడుదల చేశారు. దీనికి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా... హరిచరణ్ శేషాద్రి, సునీతా సారథీ ఆలపించారు.
'కుమ్మేసే పఠాన్... వచేశాన్...
ప్రతి మదినీ గెలిచాలే...
నేనే ఓ తుఫాన్... మేరీ జాన్...
జనమే పడిచస్తారే...' అంటూ ఈ సాగిన ఈ గీతాన్ని విదేశాల్లో భారీ సంఖ్యలో డ్యాన్సర్ల మధ్య చిత్రీకటించారు. ఇందులో కూడా షారుఖ్ ఖాన్ ప్యాక్డ్ బాడీ చూపించారు.
జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి 'వార్' వంటి సూపర్ డూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీసిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. స్పై ఫిల్మ్ అని చెప్పవచ్చు. ఇందులో షారుఖ్ ఖాన్ గూఢచారిగా కనిపించనున్నారు.
Also Read : ఆస్కార్ బరిలో తెలుగమ్మాయి నిర్మించిన పాకిస్తాన్ సినిమా
'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రాల్లో షారుఖ్, దీపిక జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు... వాళ్ళ కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. 'పఠాన్' నుంచి విడుదలైన లేటెస్ట్ స్టిల్స్ చూస్తే... ఇందులోనూ షారుఖ్, దీపిక ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉన్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ 'పఠాన్'ను నిర్మించింది. షారుఖ్, యశ్ రాజ్ ఫిల్మ్స్ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. పైగా, ఆదిత్య చోప్రా నిర్మాణంలో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్స్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేశాయి. దానికి తోడు 'పఠాన్' ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. థియేటర్లలో ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read : 'లాఠీ' రివ్యూ : విశాల్ కుమ్మేశాడు... రౌడీలనే కాదు, ప్రేక్షకులను కూడా!
'పఠాన్'కు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్!
'జాక్ రీచర్', 'మిషన్ ఇంపాజిబుల్', 'టాప్ గన్ మార్వెరిక్' చిత్రాలతో పాటు మార్వెల్ స్టూడియో, స్టీవెన్ స్పీల్‌బర్గ్ చిత్రాలకు వర్క్ చేసిన యాక్షన్ డైరెక్టర్ కాసీ ఓ నీల్. 'పఠాన్' సినిమాలో యాక్షన్ దృశ్యాలకు ఆయన దర్శకత్వం వహించారు. హాలీవుడ్‌లో ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లకు ఏ మాత్రం తగ్గకుండా 'పఠాన్'లో యాక్షన్ సీన్స్ తీశారని చిత్ర బృందం చెబుతోంది.
దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ స్టంట్స్, యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుతూ ''షారుఖ్ ఖాన్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో ఇలాంటి ఓ విజువల్ వండర్, యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నపుడు... దానికి తగ్గ విజన్ ఉన్న టీమ్ అవసరం అవుతుంది. మాకు సరిగ్గా అటువంటి ఓ టీమ్ కుదిరింది. టామ్ క్రూజ్ కోసం పని చేసిన కాసీ ఓ నీల్ మాతో పని చేశారు'' అని చెప్పారు.