Naga Chaitanya: పరశురామ్ తో సినిమా - క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య
హీరో నాగచైతన్యతో పరశురామ్ సినిమా ఉంటుందా..? ఉండదా..? అనే సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి.
అక్కినేని నాగచైతన్య నటించిన 'థాంక్యూ' సినిమా రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. చైతు తన నెక్స్ట్ సినిమా పరశురామ్ దర్శకత్వంలో చేస్తారని వార్తలొచ్చాయి. 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషన్స్ సమయంలో పరశురామ్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్లు వార్తలొచ్చాయి.
దీనికి బదులుగా చైతు.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. మొన్నామధ్య ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా వెల్లడించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. మరి పరశురామ్ తో సినిమా ఉంటుందా..? ఉండదా..? అనే సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చారు నాగచైతన్య.
నిజానికి పరశురామ్ ఇంకా తనకు స్క్రిప్ట్ నేరేషన్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు చైతు. త్వరలోనే కథ చెబుతారని వెల్లడించారు. మీడియాలో వార్తలొస్తున్నట్లు అది డ్యూయల్ రోల్ స్టోరీ కాదని చెప్పారు. వచ్చే ఏడాది సమ్మర్ కంటే ముందు వెంకట్ ప్రభు సినిమా రెడీ అవుతుందని చెప్పారు చైతు. అంటే అప్పటివరకు పరశురామ్ సినిమా ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంటుందని తెలుస్తోంది. అంటే ఎలా లేదన్నా.. మరో ఏడెనిమిది నెలల వరకు పరశురామ్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత
Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్
View this post on Instagram