Pakka Commercial: 'పక్కా కమర్షియల్' సెకండ్ సాంగ్ ప్రోమో!
'పక్కా కమర్షియల్' సినిమాలో సెకండ్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.
'రాశి.. అందాల రాశి' అంటూ జూన్ 1న గోపీచంద్, రాశిఖన్నా జోడీ కొత్త పాటతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్'. యూవీ క్రియేషన్స్, జీఏ (గీతా ఆర్ట్స్) 2 పిక్చర్స్ పతాకాలపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'బన్నీ' వాసు నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు. 'జన్మించినా.. మరణించినా.. ఖర్చే ఖర్చు.. పక్కా కమర్షియల్' అంటూ సాగిన ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు.
ఇప్పుడు సినిమాలో సెకండ్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను వదిలారు. ఇందులో విజువల్స్ ఆకట్టుకున్నాయి. హీరోయిన్ రాశిఖన్నా పేరు వచ్చేలా ఈ పాటను రాశారు. జూన్ 1న పూర్తి పాట రాబోతుంది. ఈ సినిమాలో గోపీచంద్, రాశి ఇద్దరూ లాయర్లుగా కనిపించనున్నారు.
మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు యాక్షన్, కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయట. సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్, సహ నిర్మాత : ఎస్.కె.ఎన్, లైన్ ప్రొడ్యూసర్ : బాబు, ఎడిటింగ్ : ఎన్.పి. ఉద్భవ్, సినిమాటోగ్రఫీ : కరమ్ చావ్ల , సంగీత దర్శకుడు: జేక్స్ బిజాయ్.
Also Read: ఎన్టీఆర్ శత జయంతి - చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ల ఎమోషనల్ కామెంట్స్
Also Read: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్
View this post on Instagram