Nataraj Master: నటరాజ్ మాస్టర్ హీరోగా వెబ్ సిరీస్, 'బిగ్ బాస్ ఓటీటీ' నుంచి బయటకు వచ్చాక!
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్‌లో హీరోను చూస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఆయనతో వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
నటరాజ్ గురించి చెప్పాలంటే... 'బిగ్ బాస్'కి ముందు, 'బిగ్ బాస్'కి తర్వాత అని చెప్పాలి. ఎందుకంటే... ఈ రియాలిటీ షోలోకి వెళ్ళడానికి ముందు అతనిపై ఉన్న ఇమేజ్ వేరు. ఇప్పుడు అతనిపై ఉన్న ఇమేజ్ వేరు. షోలో నటరాజ్ అగ్రెస్సివ్‌గా ఉంటారు. నిజం చెప్పాలంటే... అతడిని అగ్రెస్సివ్‌గా మార్చింది షో. 'బిగ్ బాస్'కి ముందు కొరియోగ్రాఫర్‌గా మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన అతడిలో మరో యాంగిల్‌ను బయటకు తీసుకొచ్చింది. ఒక విధంగా ఇది అతనికి మంచి చేసింది. అలాగే, చెడు కూడా చేసింది.
'బిగ్ బాస్' వల్ల నటరాజ్ మాస్టర్‌కు జరిగిన మంచి ఏంటంటే... అతనిలో హీరోని చూస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. అతనిలో నటుడిని బయటకు తీసుకొచ్చిందీ షో. దాంతో నటరాజ్ హీరోగా వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 'బిగ్ బాస్ ఓటీటీ' నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సిరీస్ వివరాలు వెల్లడించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఎమోషనల్ అండ్ అగ్రెస్సివ్ కంటెంట్‌తో ఆ సిరీస్ ఉంటుందని తెలిసింది.
ఇక, 'బిగ్ బాస్' వల్ల నటరాజ్‌కు జరిగిన బ్యాడ్ ఏంటంటే... అతని ముక్కుసూటి తనం, కోపం చేటు చేస్తోంది. హౌస్‌లో సభ్యులు, సోషల్ మీడియాలో కొంత మందికి టార్గెట్ అయ్యారు. అది ఎంతలా ఉందంటే... నటరాజ్ కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో దూషించే వరకూ వెళ్ళింది. ఈ ఎఫెక్ట్ వెబ్ సిరీస్ మీద ఉండదని మేకర్స్ భావిస్తున్నారు.
Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?
హౌస్‌లో టాస్క్‌లు అన్నీ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయని, ప్రేక్షకులు వాటిని సీరియస్‌గా తీసుకోరని, సోషల్ మీడియాలో కొంత మంది కంటెస్టెంట్‌లకు చెందిన టీమ్స్ బురదజల్లే పనులు చేస్తున్నాయని నటరాజ్ అభిమానులు అంటున్నారు.
Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.