Vidya Vasula Aham OTT: విద్య వాసుల అహం... ఆహా ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్ ప్రీమియర్ ఎప్పుడంటే?
Vidya Vasula Aham OTT Release date: రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన 'విద్య వాసుల అహం' ఆహాలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
యంగ్ హీరో రాహుల్ విజయ్ (Rahul Vijay), యాంగ్రీ స్టార్ రాజశేఖర్ - జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ (Shivani Rajasekhar) జంటగా యాక్ట్ చేసిన సినిమా 'విద్య వాసుల అహం' (Vidya Vasula Aham). ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ... ఉప శీర్షిక. థియేటర్లలో విడుదల చేయాలని తీశారు. అయితే... ఇప్పుడు ఓటీటీ విడుదలకు ఓటు వేశారు. హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మరి, ఆ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
ఆహా... వచ్చే వారమే ఎక్స్‌క్లూజివ్ ప్రీమియర్!
Vidya Vasula Aham Digital Streaming Date Locked: ఆహాలో వచ్చే వారమే 'విద్య వాసుల అహం' విడుదల కానుంది. మే 17న ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ ప్రీమియర్ షోకి ఏర్పాట్లు చేశారు. ఆ రోజు నుంచి వీక్షకులకు సినిమా అందుబాటులోకి రానుంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల చేసింది ఆహా ఓటీటీ వేదిక. అది ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంది. మరి, సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి.
View this post on Instagram
'అమ్మాయిల్ని పడేయటం కష్టం కాదు మాస్టారూ... అమ్మాయిలతో పడటం కష్టం' అనే కుర్రాడు వాసు. ఆ పాత్ర రాహుల్ విజయ్ చేశారు. 'నాకు ఏ పెళ్లీ అక్కర్లేదు' అని చెప్పే అమ్మాయి విద్య. ఆ పాత్రలో శివానీ రాజశేఖర్ నటించారు. మరి, ఈ ఇద్దరు పెళ్లి ఎలా చేసుకున్నారు? 'పెళ్లి ఒక్కటే వద్దు' అనుకునే వాసు... విద్య మెడలో మూడు ముడులు ఎందుకు వేశాడు? పెళ్లైన తర్వాత ఇగోల వల్ల ఈ జంట జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అనేది మే 17న 'ఆహా'లో సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
'విద్య వాసుల అహం' చిత్రానికి మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు ఆయన 'తెల్లవారితే గురువారం' సినిమా తీశారు. అందులో కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా కోడూరి హీరోగా నటించారు. అదీ పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. అయితే... 'విద్యా వాసుల అహం' చిత్రానికి, ముందు తీసిన చిత్రానికి కథ పరంగా ఎటువంటి కంపేరిజన్స్ లేవని చెప్పాలి. అబ్బాయి, అమ్మాయికి ఇగో ఉంటే ఆ జంట జీవితం ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కాన్సెప్ట్. 'విద్యా వాసుల అహం' సినిమాను ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.
Also Read: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన 'విద్య వాసుల అహం' సినిమాలో అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, వైవా రాఘవ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కల్యాణీ మాలిక్ సంగీతం అందించారు. వెంకటేష్ రౌతు రచయిత. ఇంకా కథనం - దర్శకత్వం: మణికాంత్ గెల్లి, నిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు - లక్ష్మీ నవ్య మక్కపాటి.