Upcoming Movies for New Year 2025 : కొత్త ఏడాదికి థియేటర్లలో కొత్త సినిమాలు... ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏంటో తెలుసా?
Upcoming Movies for New Year 2025 : 2025 న్యూ ఇయర్ సందర్భంగా ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలలో రిలీజ్ కాబోతున్న కొత్త సినిమాలు, సిరీస్ లు ఏంటో తెలుసా?
New Movies on 2025 Jan 1st : 2024కి మరికొన్ని గంటల్లో బైబై చెప్పి, 2025కు కొత్త కొత్త ఆశలతో వెల్కమ్ చెప్పడానికి సిద్ధమవుతున్నారు. అయితే మూవీ లవర్స్ ఆసక్తి మాత్రం కొత్త ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు, సిరీస్ లు ఏంటి? అన్న ఆలోచనలోనే ఉన్నారు. వాళ్ల కోసం కొత్త ఏడాది థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాలు, ఓటిటిలోకి అడుగు పెట్టబోతున్న వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి.
ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్
పలు ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకున్న మూవీ 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్'. పైగా ఈ సినిమాకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు కూడా అందాయి. పాయల్ కాపాడియా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కని కుస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలు పోషించారు. ముంబైలోని నర్సుల జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీలో ఓ రోడ్డు ట్రిప్ వారి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేది చూడొచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జనవరి 3 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితం అయ్యి, ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. రానా దగ్గుబాటి స్వయంగా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. కానీ ఊహించిన రెస్పాన్స్ అయితే రాలేదు. మరి ఇప్పుడు ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
మార్కో
ఇక ఈ ఏడాది థియేటర్లలోకి రాబోతున్న ఫస్ట్ సినిమా 'మార్కో'. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 1నే థియేటర్లలో సందడి చేయబోతోంది. హనీఫ్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే మలయాళంలో రిలీజ్ అయ్యి, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 30 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 80 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయగా, అది అంచనాలను పెంచేసింది. ఇక ఈ డబ్బింగ్ మూవీ తప్ప తెలుగులో కొత్త సినిమాలు ఏవీ రిలీజ్ కావట్లేదు.
ఆహా
డిసెంబర్ 30 - జోలి ఓ జింఖానా తమిళ మూవీ
అమెజాన్ ప్రైమ్ వీడియో
జనవరి 1 - గ్లాడియేటర్ 2 - హాలీవుడ్ మూవీ
జనవరి 2 - ది రిగ్ - సిరీస్
జనవరి 3 - గుణ - హిందీ మూవీ
నెట్ ఫ్లిక్స్
డిసెంబర్ 31 - అవిసీ - డాక్యుమెంటరీ
జనవరి 1 - డోంట్ డై - హాలీవుడ్ మూవీ
జనవరి 1 - మిస్సింగ్ యే - వెబ్ సిరీస్
జనవరి 1 - లవ్ ఈజ్ బ్లైండ్ - వెబ్ సిరీస్
జనవరి 1 - రీ యూనియన్ - హాలీవుడ్ మూవీ
జనవరి 3 - సెల్లింగ్ ది సిటీ - వెబ్ సిరీస్
జనవరి 4 - వెన్ ది స్టార్స్ గాసిప్ - వెబ్ సిరీస్
బుక్ మై షో
డిసెంబర్ 30 - క్రిస్మస్ ఇన్ మిల్లర్స్ పాయింట్ - హాలీవుడ్ మూవీ
మనోరమా మాక్స్
జనవరి 1 - ఐ యామ్ కథలన్ - మలయాళం మూవీ
Also Read: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్... ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?