అన్వేషించండి
Advertisement
Balakrishna 'Unstoppable': బాలయ్య షోకి ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలుసా..? రేపే ప్రోమో రిలీజ్..
ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' నిర్వహించే 'Unstoppable' అనే షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు బాలయ్య. ఈ షోకి మొదటి గెస్ట్ గా ఎవరు రాబోతున్నారంటే..?
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఓ షో చేయడానికి ఒప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' నిర్వహించే 'Unstoppable' అనే షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు బాలయ్య. నవంబర్ 4 నుంచి ఈ షో టెలికాస్ట్ కానుంది. ఈ షోలో బాలయ్య పేరున్న సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేయబోతున్నారు. తొలిసారి బాలయ్య యాంకర్ అవతారం ఎత్తడంతో ఈ షోపై ఆసక్తి పెరిగింది. మొన్నామధ్య ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
'వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' అంటూ ప్రోమోలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా ఈ షో తొలి ఎపిసోడ్లో మంచు మోహన్ బాబు తన పిల్లలతో కలిసి అతిథిగా రానున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని నిజమని అనౌన్స్ చేసింది 'ఆహా' సంస్థ. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీలతో బాలయ్య ముచ్చటిస్తున్న ఫోటోలను రిలీజ్ చేశారు.
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను రేపు(అక్టోబర్ 31) విడుదల చేయబోతున్నట్లు.. తొలి ఎపిసోడ్ ను నవంబర్ 4న టెలికాస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ ఎపిసోడ్ కోసమే డైలాగ్ కింగ్ మోహన్ బాబుని తీసుకురావడంతో షోపై ఆసక్తి ఏర్పడింది. మరి దీన్ని బాలయ్య తన ప్రశ్నలతో ఎలా రక్తికట్టిస్తారో చూడాలి.
ఇక సినిమాల విషయానికొస్తే.. బాలకృష్ణ రీసెంట్ గానే 'అఖండ' సినిమాను పూర్తి చేశారు. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అఖండ' పూర్తి కావడంతో బాలయ్య.. గోపీచంద్ మలినేని సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారు.
Witness the man of masses with the Dialogue King and his family! #UnstoppableWithNBK Ep-1 Promo Tomorrow!
— ahavideoIN (@ahavideoIN) October 30, 2021
Premieres Nov 4 only on #ahavideoIN#NandamuriBalakrishna @themohanbabu @iVishnuManchu @LakshmiManchu #MansionHouse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustries pic.twitter.com/ovvPD9zs74
Also Read: పెళ్లాం లేచిపోతే.... పెళ్లి కొడుక్కి వచ్చే కష్టాలు ఏంటి?
Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన
Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion