అన్వేషించండి

Bigg Boss 5 Telugu: సన్నీని హెచ్చరించిన నాగ్.. మానస్ 'బోడి మల్లన్న' అంటూ రవి సామెత..

ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ తో సరదాగా గేమ్స్ ఆడించారు నాగార్జున.

ఈరోజు ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున శుక్రవారం హౌస్ లో ఏమైందో చూపించారు. జైల్లో ఉన్న సన్నీతో హౌస్ మేట్స్ డిస్కషన్ పెట్టారు. ఆ తరువాత షణ్ముఖ్.. నేను కెప్టెన్ అవ్వడమే వాళ్లకి(మానస్, సన్నీ, కాజల్) ఇష్టం లేదని రవితో అన్నాడు. 

హౌస్ మేట్స్ కి పూరీలు చేసే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. రెండు టీమ్ లుగా విడిపోయి పూరిలు తయారు చేశారు హౌస్ మేట్స్. యానీ మాస్టర్ అండ్ కో పెర్ఫెక్ట్ గా పూరీలు చేశారని.. వాళ్లను విజేతలుగా ప్రకటించారు షణ్ముఖ్. దీంతో ఆపోజిట్ టీమ్ కాజల్ అండ్ కో హర్ట్ అయింది. జైల్లో ఉన్న సన్నీ.. 'కష్టపడి చేశారు పాపం..' అంటూ కాజల్ టీమ్ ని ఉద్దేశిస్తూ అనగా.. వెంటనే యానీ మాస్టర్.. సన్నీని పిలుస్తూ.. మేం డాన్స్ చేస్తూ చేశామన్నట్లుగా చెప్పింది. దానికి శ్రీరామ్ నవ్వాడు. మాట్లాడానికి బుద్ధి ఉండాలి అంటూ సన్నీపై ఫైర్ అయింది యానీ మాస్టర్. 
'నీకు నీ ఫ్రెండ్స్ కష్టమే కనిపిస్తుంది.. వేరే వాళ్ల కష్టం కనిపించదు' అంటూ యానీ మండిపడింది. 'న్యూట్రల్ గా ఉండడం నేర్చుకో అని.. ఒక్కరితో మాట్లాడితే ముగ్గురు వచ్చేస్తారని(సన్నీ, మానస్, కాజల్)' యానీ కామెంట్ చేయగా.. 'మీ సైడ్ ఐదుగురు ఉన్నారని' మానస్ అనగా.. శ్రీరామ్, లోబో, రవి, యానీ అందరూ కలిసి మానస్ ని టార్గెట్ చేశారు.

ఇదంతా చూసిన షణ్ముఖ్ నవ్వుకున్నాడు. అది చూసిన సన్నీ.. 'ఇక్కడ హౌస్ లో కొంతమంది బాధపడుతుంటే.. అక్కడ కూర్చొని నవ్వడం కరెక్ట్ కాదని' షణ్ముఖ్ పై మండిపడ్డాడు. బయటకొస్తాను ఆగు అంటూ వార్నింగ్ ఇవ్వడం.. దానికి షణ్ముఖ్ ఇప్పటినుంచే భయమేస్తుందని కౌంటర్ వేశాడు. 'ఇప్పుడే పోస్కోని వచ్చా.. లేకపోతే మళ్లీ వెళ్లేవాడిని' అంటూ వెటకారంగా అన్నాడు షణ్ముఖ్. 'భయపడ్డావ్ కాబట్టే నన్ను లోపల పెట్టావ్' అంటూ సన్నీ.. షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేశాడు. కొట్టు మ‌రి వెయిట్ చేస్తున్నా అని స‌వాల్ చేశాడు షణ్ముఖ్.

ఆ తరువాత జైలు నుంచి బయటకొచ్చిన సన్నీ.. శ్రీరామ్ తో డిస్కషన్ పెట్టాడు. గ్రూప్ అని ఎందుకన్నావ్ అని ప్రశ్నించాడు. దానికి శ్రీరామ్ బరాబర్ అంటాను అంటూ ఫైర్ అయ్యాడు. 

Also Read: తల్లితండ్రుల అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశంలోనే...

అనంతరం హౌస్ మేట్స్ తో మాట్లాడిన నాగార్జున.. నామినేషన్ టాస్క్ లో లెటర్స్ ను వదిలేసుకున్న సిరి, షణ్ముఖ్, రవి, లోబో, మానస్, శ్రీరామ్ లను స్పెషల్ గా అప్రిషియేట్ చేశాడు నాగార్జున. 

  1. లోబో ఫోటోని చించేస్తూ.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో చాలా కష్టపడ్డావ్ అని ఇంకాస్త కష్టపడాలని చెప్పారు నాగార్జున.   
  2. రవి ఫోటోని నాగార్జున చించేస్తూ.. ఎందుకు డల్ గా ఉంటున్నావని ప్రశ్నించగా.. ఫ్యామిలీ విషయంలో ఎందుకో టెన్షన్ గా ఉంటుందని చెప్పగా.. 'అన్నీ తెలుసుకొనే హౌస్ లోకి వచ్చావు.. నువ్ వెళ్లిపోతానంటే ఇప్పుడే డోర్స్ ఓపెన్ చేయిస్తా అని' అన్నారు నాగార్జున. ఫ్యామిలీ ఎలా ఉందనే టెన్షన్ తప్ప ఇంకేం లేదని చెప్పింది.
  3. మానస్ తో మాట్లాడుతూ.. గేమ్ ఆడే ముందు కొంచెం ఆలోచించు అని సలహా ఇచ్చారు. 'ఈ హౌస్ లో ఏమైనా అన్యాయం జరుగుతుందని అనిపిస్తుందా..?' అని ప్రశ్నించగా.. అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు అని ఆన్సర్ చేశాడు. ఈ వారం ఎవరు అన్యాయం చేశారనిపిస్తుందని అని అడగ్గా.. సంచాలక్ గా జెస్సీ అన్యాయం చేశాడనిపించిందని చెప్పాడు. దానికి నాగార్జున.. సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పారు.
  4. ప్రియాంకతో మాట్లాడుతూ.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో బాగానే ఆడావ్ కానీ.. నీ దృష్టి యానీ మాస్టర్ పై పెట్టావ్ అని అన్నారు.
  5. యానీతో మాట్లాడుతూ.. కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ మొత్తం ప్రోత్సహిస్తుంటే నువ్ ఎందుకు గివప్ ఇచ్చావ్ అని ప్రశ్నించాడు. దానికి ఆమె గెలవడం ఇష్టంలేక వదిలేశానని చెప్పింది.
  6. కాజల్ తో మాట్లాడుతూ.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో తొండి గేమ్ ఆడడం ఏంటి..? గెలుపు కూడా పద్దతిగా ఉండాలని చెప్పారు.
  7. జెస్సీతో మాట్లాడుతూ.. సంచాలక్ గా నియమించినప్పుడు బాగా అర్ధం చేసుకొని ఆడమని చెప్పారు నాగార్జున.
  8. సన్నీతో మాట్లాడిన నాగ్.. 'ఏంటి..? హౌస్ కి నువ్వే కెప్టెన్ అనుకుంటున్నావా..?' అని ప్రశ్నించారు నాగ్. 'సంచాలక్ కు వ్యతిరేకంగా వెళ్లడం నా తప్పు అని.. చాలా మంది ప్రవోక్ చేశారని.. చెప్పగా..' చేస్తే అయిపోతావా..? అని అడిగారు నాగ్. వేలు చూపిస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. 'అరువు, ఆర్గ్యూ చెయ్ కానీ వేలు చూపిస్తూ మీద మీదకు వెళ్లడం తప్పని' చెప్పారు నాగ్. సంచాలక్ జూట్ బ్యాగ్ పట్టుకొని ఉంటే ఎలా వెళ్లి తన్నావ్ అని ప్రశ్నించారు నాగ్. కంట్రోల్ లో ఉండమని అన్నారు. 

ఆ తరువాత హౌస్ మేట్స్ తో ల్యాడర్ అండ్ స్నేక్స్ గేమ్ ఆడించారు నాగార్జున. హౌస్ లో మిమ్మల్ని పైకి ఎక్కించేవారికి నిచ్చెన ఇవ్వాలని.. కిందకి లాగాలని చూసేవారికి స్నేక్ ఇవ్వాలని చెప్పారు. 

  • కాజల్ - నిచ్చెన మానస్ కి ఇచ్చి.. స్నేక్ శ్రీరామచంద్రకు ఇచ్చింది.
  • రవి - నిచ్చెన, స్నేక్ రెండూ లోబో అనే అనిపిస్తుందని ఫన్నీగా చెప్పాడు. ఆ తరువాత నిచ్చెన షణ్ముఖ్ కి, స్నేక్ కాజల్ కి ఇచ్చాడు.
  • జెస్సీ - నిచ్చెన విశ్వకి ఇచ్చి, స్నేక్ సన్నీకి ఇచ్చాడు.
  • ప్రియాంక - నిచ్చెన మానస్ కి ఇచ్చి.. స్నేక్ లోబోకి ఇచ్చింది.
  • సన్నీ - నిచ్చెన మానస్ కి ఇచ్చి.. స్నేక్ షణ్ముఖ్ కి ఇచ్చాడు.
  • విశ్వ - నిచ్చెన లోబోకి ఇచ్చి.. కాజల్ కి స్నేక్ ఇచ్చాడు.
  • లోబో - నిచ్చెన రవికి ఇచ్చి.. సన్నీకి స్నేక్ ఇచ్చాడు.
  • శ్రీరామ్ - యానీ మాస్టర్ కి నిచ్చెన ఇచ్చి.. కాజల్ కి స్నేక్ ఇచ్చాడు.
  • యానీ మాస్టర్ - రవికి నిచ్చెన ఇచ్చి.. కాజల్ కి స్నేక్ ఇచ్చింది.
  • మానస్ - సన్నీకి నిచ్చెన ఇచ్చి.. రవికి స్నేక్ ఇచ్చాడు.
  • షణ్ముఖ్ - సిరికి నిచ్చెన ఇచ్చి.. రవికి స్నేక్ ఇచ్చాడు.
  • సిరి - షణ్ముఖ్ కి నిచ్చెన ఇచ్చి.. సన్నీకి స్నేక్ ఇచ్చింది. 

నాగిని ఆఫ్ ది హౌస్ కాజల్ గా, స్నేక్ ఆఫ్ ది హౌస్ సన్నీకి ఇచ్చారు నాగార్జున. 

మెడలో మోత.. సరిపోయే సామెత.. 

హౌస్ మేట్స్ తో సామెతలకు సంబంధించిన గేమ్ ఆడించారు నాగార్జున. ఎవరికైతే నాగార్జున చెప్పే సామెత సూట్ అవుతుందో వాళ్లకు మెడలో ఆ సామెతకు సంబంధించిన మెడల్ ను వేయమని చెప్పారు నాగార్జున.

  • ముందుగా సన్నీకి 'కుక్క తోక వంకర' అనే సామెత ఇవ్వగా.. దానికి జెస్సీను సెలెక్ట్ చేసుకున్నాడు సన్నీ.
  • మానస్ కి 'అబద్ధం ఆడినా.. అతికినట్లు ఉండాలి' అనే సామెత ఇవ్వగా.. రవి మెడలో ఆ సామెత మెడల్ ను వేశాడు. బాగా మ్యానేజ్ చేస్తుంటాడని చెప్పాడు.
  • కాజల్ కి 'ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది' అనే సామెత ఇవ్వగా..  దానికి శ్రీరామచంద్రను సెలెక్ట్ చేసింది.
  • యానీకి 'రాను రాను రాజు గుర్రం గాడిదయ్యింది' అనే సామెత ఇవ్వగా.. దానికి కాజల్ ని సెలెక్ట్ చేసింది. రెండు వారాలుగా ఆమెలో ఫైర్ కనిపించడం లేదని చెప్పింది.
  • ప్రియాంకకు 'కందకు లేని దురద కత్తికి ఎందుకు' అనే సామెత ఇవ్వగా.. సిరికి ఆ సామెత సూట్ అవుతుందని చెప్పింది.
  • శ్రీరామచంద్రకు 'అంతంత కోడికి అర్ధసేరు మసాలా' అనే సామెత ఇవ్వగా.. కాజల్ కి సూట్ అవుతుందని చెప్పాడు.
  • విశ్వకి 'దున్నపోతు మీద వర్షం కురిసినట్టు' అనే సామెత ఇవ్వగా.. అది లోబోకి సూట్ అవుతుందని చెప్పాడు.
  • జెస్సీకి 'పైన పటారం లోన లొటారం' అనే సామెత ఇవ్వగా.. ఆ సామెత మెడల్ ను సన్నీకి ఇచ్చాడు.
  • సిరికి 'అందని ద్రాక్షపండ్లు పుల్లన అన్నట్లు' అనే సామెత ఇవ్వగా.. షణ్ముఖ్ కి ఆ మెడల్ ను ఇచ్చింది.
  • షణ్ముఖ్ కి 'ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్లు' అనే సామెత ఇవ్వగా.. అది రవికి ఇచ్చాడు.
  • రవి 'ఓడ ఎక్కే వరకు ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్న' అనే సామెత ఇవ్వగా.. మానస్ కి ఆ సామెత సూట్ అవుతుందని చెప్పాడు.
  • లోబోకి 'చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం' అనే సామెత ఇవ్వగా.. అది యానీ మాస్టర్ కి సూట్ అవుతుందని చెప్పాడు. 
    నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిని నుంచోమని చెప్పిన నాగార్జున.. ఎవరు ఎలిమినేట్ అవుతారో రేపు చెప్తానని అన్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget