Trinayani Actor Chandrakanth: ఇండస్ట్రీ నుంచి చందు కుటుంబానికి ఆర్థిక సాయం.. అసలు విషయం చెప్పిన టీవీ నటి నీరజ!
Trinayani Serial Actor Chandu: నటి పవిత్ర జయరాం, చందు రిలేషన్‌పై టీవీ నటి నీరజ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే చందు కుటుంబానికి ఇండస్ట్రీ నుంచి ఆర్థిక సాయంపై కూడా ఆమె స్పందించారు.
Actress Neeraja Shocking Facts About Trinayani Actor Chandu త్రినయని సీరియల్స్ నటీనటులు పవిత్ర జయరామ్, చంద్రకాంత్ అలియాస్ చందు రిలేషన్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది. నటీనటుల నుంచి సాధారణ ఆడియన్స్ వరకు అంతా వారి గురించి మాట్లాడుకుంటున్నారు. తన ప్రియురాలు పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కన్నుమూసిన రోజుల వ్యవధిలోనే చందు ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మరణం అనంతరం చందు, పవిత్ర అసలు రిలేషన్ బయటపడటంతో అంతా కంగుతిన్నారు. ఇద్దరికి వేరువేరుగా పెళ్లయిన ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నట్టు అసలు విషయం బయటపడింది. అంతేకాదు పవిత్ర వల్ల తమ వైవాహిక జీవితంలో మనస్పర్థలు, గొడవలు వచ్చాయని, తన భర్త తనకు దూరమయ్యాడు చందు భార్య శిల్పా ఖన్నా చెప్పడంతో ఈ వ్యవహరం మరింత ముదిరింది.
అంతా పవిత్ర జయరామ్, చందు రిలేషన్‌ని వ్యతిరేకిస్తున్నారు. ఆమె యాక్సిడెంట్ వల్ల చనిపోయింది.. దానికి ఎవరూ ఏం చేయలేరు.. కానీ తాళి కట్టిన భార్య, పిల్లలు ఉన్న చందు ఆమె కోసం ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. అలా నెటిజన్లు, నటీనటుల నుంచి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా చందు, పవిత్ర జయరామ్ రిలేషన్‌పై టీవీ నటి నీరజ స్పందించారు. తాజాగా యూట్యూబ్ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన ఆమె చందు తీరుపై స్పందించారు. "చందుకు నాకు దాదాపు ఏడేళ్ల పరిచయం ఉంది. ఇదరం కలిసి మూడు ప్రాజెక్ట్స్ చేశాం. అప్పుడు చాలా మంచిగా, పద్దతిగా ఉండేవాడు. ఇద్దరు బ్రదర్, సిస్టర్‌లా ఉండేవాళ్లం. కానీ 'అలా వైకుంటపురం' సీరియల్ టైంలో ఈ విషయం తెలిసిందే. అప్పుడే అంతా పవిత్ర జయరామ్, చందు రిలేషన్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. చందు ఇలా చేస్తున్నాడని తెలిసి అతడి దూరం పెట్టాను. నేనే కాదు అతడికి దగ్గరగా ఉన్న పలువురు కూడా చందుతో మాట్లాడటం తగ్గించారు. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా మా మధ్య పరిచయం కూడా తగ్గిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీ నుంచి ఆర్థిక సాయం ఏమైనా..
"ఇలాంటి విషయాల్లో ఎదుటి వ్యక్తి ఎంత క్లోజ్ ఉన్న వారి సర్ది చెప్పలేమన్నారు. ఎందుకంటే వాళ్లేం చిన్న పిల్లలు కాదు. ఇద్దరికి పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి ఇలా రిలేషన్ అంటూ తప్పుదారిలో వెళ్తున్నారు. అది తప్పు అని ఆ వయసు వాళ్లకి ఏం చెబుతాం. చెప్పిన వింటారా? అందుకే నేను చనువు తీసుకుని చెప్పలేకపోయా. కానీ ఈ విషయంలో చందు నిర్ణయాన్ని నేను స్వాగతించను. చందు ఒకసారి ఆలోచించాల్సింది. పెళ్లి తర్వాత ఎవరికైనా మరో వ్యక్తిపై ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ దాన్ని నియంత్రించకుని ఎథిక్స్ పరంగా వెళ్లాలి. అయినా భార్య, పిల్లలు ఉండగా మరో వ్యక్తితో ప్రేమ ఏంటీ? భార్యను కూడా ప్రేమించాడు కదా.
అది ప్రేమ కాదా? ఇప్పుడు ఏంటీ ప్రేమించానని చెప్పి ఆమె కోసం చనిపోయావు. ఇప్పుడు బాధపడుతుంది ఎవరూ.. నువ్వు కన్న బిడ్డలు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నిన్ను నమ్మి వచ్చిన భార్యే కదా" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి చందు కుటుంబానికి ఎదైనా ఆర్థిక సాయం చేస్తున్నారా? అని యాంకర్ అడగ్గా. ఏమో తనకి అది తెలియదని, మరి విడివిడిగా ఎవరైనా చేస్తుండోచ్చు. ఇండస్ట్రీ నుంచి అయితే అలాంటి ఏం చేయలేదు.. చేస్తారేమో తెలియదు. ఈ టైంలో ఎవరైనా వారికి మోరల్ సపోర్టు మాత్రమే ఇవ్వగలరు కానీ, ఆర్థిక సాయం ఎవరూ చేస్తారంటూ ఆమె పేర్కొంది.
Also Read: మా అమ్మనాన్న విడాకులు తీసుకోలేదు - సంచలన విషయాలు బయటపెట్టిన పవిత్ర జయరామ్ కూతురు, భర్త ఎమోషనల్