Horror Films and Series To Watch on Netflix: హర్రర్ సినిమాలు అంటే ఇష్టమా? నెట్ ఫ్లిక్స్ లోని టాప్ 10 హర్రర్ సినిమాలు మీ కోసం
Top 10 Horror Movies: హర్రర్ సినిమాలంటే చాలామందికి ఇష్టం. భయపడుతూనే ఆ సినిమాలని ఎంజాయ్ చేస్తారు చాలామంది. అలాంటి వాళ్ల కోసం నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 హర్రర్ సినిమాలు ఇవి.
10 Horror Movies And Series To Watch On Netflix: హర్రర్ సినిమాలు సస్పెన్స్, భయం అన్ని కలగలిపి థ్రిల్లింగ్ గా ఉంటాయి. అలాంటి సినిమాలు చూసేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. ఒకవైపు భయం వేస్తున్నా, ఆ భయాన్నే ఎంజాయ్ చేస్తారు చాలామంది. సినిమా చూస్తే అదో ప్రపంచంలోకి వెళ్లిపోతారు. క్లాసిక్ హాంటెడ్ హౌస్ టేల్స్ నుండి మోడరన్ సైకలాజికల్ థ్రిల్లర్‌ల వరకు అన్నింటినీ ఎంజాయ్ చేస్తారు హర్రర్ సినిమా లవర్స్. అలా హర్రర్ ని ఎంజాయ్ చేసేవాళ్ల కోసం నెట్ ఫ్లిక్స్ చాలా సినిమాలే తీసుకొచ్చింది. వాటిల్లో టాప్ 10 సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ది కాన్ఫరెన్స్ :
ది కాన్ఫరెన్స్ సినిమా సైకలాజికల్ హర్రర్ సినిమా. ఒక ఆఫీస్ లోని ఉద్యోగులు అంతా.. ఒక కార్పొరేట్ రీ ట్రీట్ కి మారుమూల ప్రాంతంలోని హోటల్ కి వెళ్తారు. అక్కడే చిక్కుకుపోయిన వాళ్లకి వింత శబ్దాలు వినిపించడం, వింగ ఘటనలు సంభవించడం లాంటివి జరుగుతుంటాయి.
బ్లడ్ రైడ్:
ఇది వెబ్ సిరీస్. నార్వేజియన్ ఆంథాలిజీ సిరీస్. స్కాండినేవియన్ జాపపద కథల నుంచి ప్రేరణ పొందిన భయానక కథల నుంచి ఈ సిరీస్ తెరకెక్కించారు. ప్రతి ఎపిసోడ్ లో ఒక సస్పెన్స్ ఉంటుంది. హర్రర్ ఎక్స్ పీరియెన్స్ చేయాలని అనుకునేవాళ్లకి ఈ సినిమా చాలా బాగుంటుంది.
ది ఇన్ ఫ్ల్యూయెన్స్ :
ఇది సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఒక కుటుంబం అమ్మాయిని దత్తత తీసుకుంటుంది. ఆ అమ్మాయితో వారి బంధం బలపడుతున్న కొద్ది వాళ్ల ఇంట్లో ఏదో జరుగుతుంది. ఆ అమ్మాయి ఏదో రహస్యాన్ని దాచిపెట్టిందని, ఆ అమ్మాయి వల్లే ఇలా జరుగుతుందని వాళ్లంతా అనుకుంటారు. సస్పెన్స్ లు, ట్విస్ట్ లతో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ది మిస్ట్ :
స్టీఫెన్ కింగ్స్ నవల ఆధారంగా ఈ హర్రర్ సినిమాని తెరకెక్కించారు. ఒక గ్రాసరీ షాప్ లో కొంతమంది బంధీ అవుతారు. ఒక పొగ కమ్ముకోవడం వల్ల వాళ్లంతా బంధీ అవుతారు. ఆ తర్వాత వాళ్లకి కొన్ని జంతువుల లాంటివి కనిపిస్తాయి. అవేంటి అనేది సస్పెన్స్.
పొజషన్ ఆఫ్ హన్నా గ్రేస్ :
ఇది కూడా సైకలాజికల్ హర్రర్ సినిమా. దయ్యం పట్టిన యువతి, యువ భూతవైద్యుడి మధ్య ఉండే సంబంధం గురించి ఈ సినిమా.
ఓల్డ్ పీపుల్ :
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న హర్రర్ వెబ్ సిరీస్ లతో ఓల్డ్ పీపుల్ కూడా ఒకటి. కొంతమంది ఫ్రెండ్స్ వీకెండ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. దీంతో వాళ్లంతా ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తారు. అక్కడ కొన్ని వింతలు జరుగుతాయి. పవర్ పోతుంది. వాళ్లంతా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి.
మరియానే :
ఇది కూడా హర్రర్ వెబ్ సిరీస్. సక్సెస్ ఫుల్ ఫ్రెంచ్ నావలిస్ట్ రాసిన వెబ్ సిరీస్ ఇది. ఆ నావలిస్ట్ తన సొంత ఊరికి వెళ్తుండగా అక్కడ కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయని భావిస్తుంది. అయితే, అవి నిజంగానే ఉంటాయి. అదే ఈ సిరీస్ స్టోరీ.
మిర్రర్స్ :
ఇది అమెరికన్ సిరీస్. 2008లో ఈ సినిమాని రీమేక్ చేశారు. ఒక ఊరిలో వరుసగా సంభవిస్తున్న మరణాలపై డిటెక్టివ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. వాళ్లంతా హాంటెడ్ మిర్రర్స్ ద్వారా మరణించారని తెలుసుకోవడమే ఈ సీరిస్.
ది యాన్ సెస్ట్రల్ :
ఇది స్పానిష్ సిరీస్. ఒక వ్యక్తి పురాతన బంగ్లాకి షిప్ట్ అవుతాడు. ఆ తర్వాత అక్కడ ఒక ఆత్మ తిరుగుతుందని కనుక్కుంటాడు. ఆ బంగ్లా గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్లు ప్రయత్నాలు చేస్తుండగా.. ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. అదే ఈ సిరీస్.
బీటాల్ :
ఇది ఇండియన్ సిరీస్. ఒక ఆర్మీ కమాండర్ జాంబీలాగా ప్రాణం పోసుకుంటాడు. ఒక మారుమూల గ్రామంలో ప్రత్యేక దళాలు అతనితో పోరాటం చేస్తుంది. జానపద కథలు, సైనిక చర్యలు లాంటి విలక్షణమైన కథలో హర్రర్ ఎక్కువగా ఉంటుంది సినిమాలో.
అదండీ మ్యాటరు. సైకలాజికల్ థ్రిల్లర్స్, సూపర్ నేచురల్ హర్రర్ సినిమాలు, క్లాసికల్ హర్రర్ సినిమాలు.. హర్రర్ ఏ జోనర్ కావాలన్నా నెట్ ఫ్లిక్స్ అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. నెట్ ఫ్లిక్స్ తో మీ హర్రర్ సినిమా క్రేవింగ్స్ ని తీర్చుకోండి. లైట్స్ ఆఫ్ చేసి, స్నాక్స్ ముందు పెట్టుకుని, సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ ని ఎంజాయ్ చేయండి.
Also Read: జంధ్యాల... 'సారంగపాణి జాతకం'... ఇంద్రగంటి... ఆ లోటు భర్తీ!