Thudarum OTT Release Date: ఓటీటీలోకి మోహన్ లాల్ హిట్ మూవీ 'తుడరుమ్' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Thudarum OTT Platform: మలయాళ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'తుడరుమ్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Mohanlal's Thudarum OTT Release On Jio Hotstar: మలయాళ స్టార్ మోహన్ లాల్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ 'తుడరుమ్' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. దాదాపు రూ.230 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ సినిమా ఈ నెల 30 నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో మోహన్ లాల్ సరసన శోభన నటించారు. కేవలం కేరళ బాక్సాఫీస్ వద్దే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఫస్ట్ మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది 'తుడరుమ్'.
View this post on Instagram
ఈ చిత్రాన్ని రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై తరుణ్ మూర్తి తెరకెక్కించారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో దాదాపు 38 ఏళ్ల తర్వాత మోహన్ లాల్, శోభన జంటగా నటించి మెప్పించారు.
స్టోరీ ఏంటంటే?
షణ్ముఖం అలియాస్ బెంజ్ (మోహన్ లాల్) ఒకప్పుడు తమిళ సినిమాలకు యాక్షన్ డూప్‌గా నటించేవాడు. ఓ యాక్సిడెంట్ తర్వాత అన్నింటినీ వదిలేసి తన మాస్టర్ (భారతీ రాజా) ఇచ్చిన కారుతో కేరళలో స్థిరపడతాడు. భార్య లలిత (శోభన), ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తాడు. ఓసారి అనుకోకుండా తన కారును పోలీసులు తీసుకెళ్తారు. ఆ కారును చాలా ప్రయత్నాల తర్వాత ఇంటికి తీసుకొస్తాడు. అతను తిరిగి ఇంటికి వచ్చే సరికి అతని కొడుకు కనిపించకుండా పోతాడు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బెంజ్.. తన కొడుకును వెతికే క్రమంలో విస్తుపోయే విషయాలు తెలుసుకుంటాడు. అసలు పోలీసులు బెంజ్ కారును ఎందుకు తీసుకెళ్లారు?, అతని కొడుకు కనిపించకుండా పోవడానికి కారణాలేంటి?, పోలీసులను, బెంజ్‌ను షాకింగ్‌కు గురి చేసే ఘటనలేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.





















