అన్వేషించండి

Telugu Dubbed Web Series: ఓటీటీలో రిలీజైన ఈ థ్రిల్లింగ్ వెబ్‌ సీరిస్‌లను తెలుగులోనూ చూసేయొచ్చు!

మీకు ఇంటర్నేషనల్ యాక్షన్, థ్రిల్లర్స్ ఇష్టమా? అయితే, వాటిని మీరే తెలుగులోనే చూసేయొచ్చు. పలు వెబ్ సీరిస్‌లు తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూసేయండి మరి.

టీటీలు వచ్చిన తర్వాత వెబ్ సీరిస్‌లకు ఎంత క్రేజ్ లభిస్తోందో తెలిసిందే. ముఖ్యంగా వివిధ దేశాలు, భాషల వెబ్ సీరిస్‌లను చూసే అవకాశం లభిస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో బోలెడన్ని ఇంటర్నేషనల్‌ వెబ్ సీరిస్‌లు, టీవీ షోస్ అందుబాటులో ఉంటున్నాయి. యూఎస్, యూకే‌తోపాటు స్పానిష్, కొరియా వెబ్ సీరిస్‌లకు భలే క్రేజ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థలు ఇండియాలో ప్రధాన భాషల్లో రిలీజ్ చేస్తున్నాయి. చాలావరకు వెబ్ సీరిస్‌లు హిందీలో రిలీజ్ చేస్తుంటే.. ‌Netflix, Amazon prime video ఓటీటీల్లో బాగా పాపులారిటీ ఉండే ‘మనీ హీస్ట్’, ‘స్క్విడ్ గేమ్స్’, ‘జాక్ ర్యాన్’, ‘రింగ్ ఆఫ్ పవర్’, ‘ది బాయ్స్’, ‘ది వీల్ ఆఫ్ టైమ్’ వంటి వెబ్ సీరిస్‌లను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కూడా మార్వెల్ సంస్థకు చెందిన వెబ్ సీరిస్‌లను సైతం తెలుగులోనే విడుదల చేస్తున్నారు. తాజాగా Aha, Zee5 సైతం కొరియాలో పాపులరైన టీవీ షోలు, సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాయి. ఈ ఏడాది తాజాగా విడుదలైన తెలుగు అనువాద వెబ్ సీరిస్‌లు ఏమిటో చూసేద్దామా మారి. 

ది బాయ్స్ (The Boys): అమెజాన్ ప్రైమ్‌లో 2019 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సీరిస్‌కు భలే క్రేజ్ ఉంది. సాధారణంగా సూపర్ హీరోస్‌ను మనం హీరోల్లా చూస్తుంటాం. కానీ, ఇందులో సూపర్ హీరోసే విలన్స్. ఇప్పటికే ఈ సీరిస్‌ నుంచి మూడు సీజన్లు వచ్చాయి. 2022లో మూడో సీజన్ రిలీజ్ అయ్యింది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. 

ఎలైట్ (Elite): నెట్‌ఫ్లిక్స్‌లో 2018 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న యూత్‌‌ఫుల్ వెబ్ సీరిస్ ఇది. ఒక స్కూల్లో విద్యార్థుల గ్రూపుల మధ్య జరిగే గొడవలు, హత్యల మిస్టరీలతో ఈ సీరిస్ నడుస్తోంది. ఇప్పటికే 6 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది విడుదలైన 6వ సీజన్ కూడా తెలుగులో అందుబాటులో ఉంది. 

ది రింగ్స్ ఆఫ్ పవర్ (The Rings of Power): ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ మూవీ సీరిస్ చూసినవారికి ఈ వెబ్ సీరిస్ కూడా బాగా నచ్చేస్తుంది. ఈ సీరిస్ ఫస్ట్ సీజన్ ఈ ఏడాది నుంచే మొదలైంది. ఈ వెబ్ సీరిస్ ఒక విజువల్ వండర్. స్టోరీ కూడా ఫ్యామిలీతో కూర్చొని చూసే విధంగా మలిచారు. పిల్లలతో కూడా చూడొచ్చు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 

ది విచర్: బ్లడ్ ఆరిజిన్ (The Withcher: Blood Origin): నెట్ ఫ్లిక్స్‌లో మరో థ్రిల్లింగ్ వెబ్‌సీరిస్ ‘ది విచర్’కు ప్రీక్వెల్ ‘ది విచర్: బ్లడ్ ఆరిజిన్’. కొద్ది రోజుల కిందట విడుదలైన ఈ లిమిటెడ్ సీరిస్‌కు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. 2023లో విడుదల కానున్న ‘ది విచర్’ సీజన్-3తో ఈ సీరిస్ లింక్ కానుంది. కాబట్టి, బ్లడ్ ఆరిజిన్ చూడటానికి ముందు ‘ది విచర్’ వెబ్ సీరిస్‌ను ముందుగా చూసేయండి.

జాక్ ర్యాన్ (Jack Ryan): జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి జాన్ క్రాసిన్స్కి నటించిన ‘జాక్ ర్యాన్’ వెబ్ సీరిస్ బాగా నచ్చుతుంది. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేందుకు సీఐఏ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ జాక్ ర్యాన్ ఏం చేస్తాడనేది కథ. 

స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things): 2016లో ప్రారంభమైన వెబ్ సీరిస్ ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. ఈ సీరిస్ నుంచి మొత్తం 4 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది నాల్గవ సీజన్ రిలీజైంది. అన్ని సీజన్లు తెలుగులో అందుబాటులో ఉన్నాయి. ఈ సీరిస్ చాలా ఉత్కంఠభరితంగా, భయానకంగా ఉంటుంది. 80వ దశకం నాటి మ్యూజిక్ మనల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్తుంది. 

ది పెరిఫెరల్ (The peripheral): ఈ సీరిస్ మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అనారోగ్యంలో ఉన్న తల్లిని కాపాడేందుకు ఓ యువతి డబ్బు కోసం వీఆర్ గేమ్స్‌‌ ఆడుతుంటుంది. ఆమెకు ఓ సారి కొలంబియాలోని ఓ సంస్థ నుంచి అడ్వాన్స్‌డ్ హె‌డ్‌సెట్‌ను పంపిస్తుంది. అది ఆమెను ఓ సరికొత్త సిమ్ వరల్డ్‌లోకి పంపిస్తుంది. ఆ తర్వాత కథ ఆసక్తికరంగా మారుతుంది. చివరికి అది ఆమె భవిష్యత్తునే శాసిస్తుంది. ఇది కూడా ఈ ఏడాదే విడులైంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఈ సీరిస్ స్ట్రీమింగ్ అవుతోంది. 

షీ హల్క్ (She Hulk) & మిస్ మార్వెల్ (Ms Marvel): మార్వెల్ వరల్డ్‌లో విహరించే ప్రేక్షకులకు ఈ వెబ్ సీరిస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అవేంజర్స్’లో ఒకరైన.. హల్క్ కజిన్ కూడా హల్క్‌లా మారిపోతుంది. కామెడీ, యాక్షన్, డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సీరిస్ నచ్చుతుంది. పిల్లలతో కూడా కలిసి చూడవచ్చు. అలాగే ‘మిస్ మార్వెల్’ కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యింది. దీన్ని కూడా మీరు తెలుగులో చూడవచ్చు. ఈ వెబ్ సీరిస్‌లు ప్రస్తుతం ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో ఈ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. 

ది టెర్మినల్ లిస్ట్ (The Terminal List): నేవీ సీల్ కమాండర్ జేమ్స్ రీస్ తన మొత్తం ప్లాటూన్ హత్య వెనుక ఉన్న రహస్య శక్తులను కోసం వెతుకుతాడు.   సైన్యంలో కమాండ్ స్ట్రక్చర్‌ను వదిలిపెట్టి ప్రతీకారం తీర్చుకొనేందుకు బాధ్యులను వేటాడేందుకు తన వార్ స్కిల్స్‌ను ఉపయోగిస్తాడు. సస్పెన్స్, యాక్షన్, డ్రామాలను ఇష్టపడేవారికి ఈ వెబ్ సీరిస్ నచ్చుతుంది. ఈ ఏడాది ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈ వెబ్ సీరిస్ విడుదలైంది. దీన్ని తెలుగులో కూడా చూడవచ్చు. 

Read Also: రెమ్యునరేషన్ లేకుండా ‘వరిసు‘ కోసం పనిచేసిన శింబు, వీళ్లు కూడా నయా పైసా తీసుకోలేదు తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Advertisement

వీడియోలు

అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Australia vs India 4th T20I Match Highlights | నాలుగో టీ20 లో గెలిచిన టీమిండియా | ABP Desam
వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Chikiri Chikiri Song : సిగ్నేచర్ షాట్ విత్ హుక్ స్టెప్ - మన పెద్దిగాడి 'చికిరి చికిరి' అదిరిపోయింది
సిగ్నేచర్ షాట్ విత్ హుక్ స్టెప్ - మన పెద్దిగాడి 'చికిరి చికిరి' అదిరిపోయింది
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Bandi Sanjay: హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
Embed widget