అన్వేషించండి

‘The Boys’ Season 4 Trailer: ‘ది బాయ్స్’ సీజన్ 4 ట్రైలర్: జంతువులకూ సూపర్ పవర్స్ వస్తే? ఈసారి మరింత థ్రిల్‌ పక్కా!

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'ది బాయ్స్' సీజన్ 4 ట్రైలర్ వచ్చేసింది. గత సీజన్లను తలదన్నేలా కొత్త సిరీస్ తెరకెక్కింది. కళ్లు చెదిరే యాక్షన్ సీన్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

‘The Boys’ Season 4 Trailer Out: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హాలీవుడ్ వెబ్ సిరీస్ 'ది బాయ్స్' సీజన్ 4 ట్రైలర్ వచ్చేసింది. చాలా మంది సూపర్ మ్యాన్స్ భూమిని, ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తే, ఈ సిరీస్ లో మాత్రం తమ స్వార్థం కోసం ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకునేందు ప్రయత్నిస్తారు. ఇప్పటి వరకు వచ్చిన మూడు సీజన్లు ప్రేక్షకులను అద్భుతంగా అరించడంతో నాలుగో సీజన్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినీ లవర్స్ కు అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఈ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగానే తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది.

ఆకట్టుకుంటున్న 'ది బాయ్స్' సీజన్ 4 ట్రైలర్

తాజాగా విడుదలైన 'ది బాయ్స్' సీజన్ 4 ట్రైలర్ కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ అంతా రక్తపాతంతో నిడిపోయింది. హోమ్‌ల్యాండర్‌(ఆంటోనీ స్టార్)ను తొలగించడానికి బుచర్ కాలానికి వ్యతిరేకంగా పోటీ పడుతాడు. అత్యంత భయంకరమైన వైరస్ తో అతడిని అంతమొందించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నం ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? నిజంగానే హోమ్ ల్యాండర్ ను లేకుండా చేస్తారా? హోమ్ ల్యాండర్ ఆ ప్రయత్నాలను ఎలా తిప్పికొడతాడు? అనేది వెబ్ సిరీస్ లో చూపించనున్నారు. అత్యంత ఉత్కంఠ భరితంగా ఉన్న ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీజన్ లో కూడా హోమ్ ల్యాండర్ క్యారెక్టర్ లో ఆంటోనీ స్టార్ ఆకట్టుకోబోతున్నారు. ప్రత్యర్థులకు చెమటలు పట్టించనున్నారు. గత సీజన్లతో పోల్చితే మరింత పవర్ ఫుల్ గా కనిపించబోతున్నారు. అంతేకాదు.. ఈ సారి జంతువులకు కూడా సూపర్ పవర్స్ వచ్చినట్లు ట్రైలర్‌లో చూపించారు.

మే 13 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

'ది బాయ్స్' సీజన్ 4  వెబ్ సిరీస్ జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. ప్రీమియర్ గా మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఆ తర్వాత వారానికి ఓ ఎపిసోడ్ రానుంది. జూలై 18న ఈ సీజన్ కంప్లీట్ అవుతుంది. ఈ సీజన్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఒకేసారి విడుదల కానుంది. ‘ది బాయ్స్’ వెబ్ సిరీస్ కు సంబంధించి గత సీజన్లుకు దర్శకత్వం వహించిన ఫిల్ స్గ్రారిక్కియా.. నాలుగో సీజన్ ను కూడా తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో అర్బన్, క్వాయిడ్, స్టార్, మోరియార్టీ, జెస్సీ టి. అషర్, లాజ్ అలోన్సో, చేస్ క్రాఫోర్డ్, టోమర్ కాపోన్, కరెన్ ఫుకుహారా, కోల్బీ మినిఫై, క్లాడియా డౌమిట్, కామెరాన్ క్రోవెట్టి కీలక పాత్రల్లో నటించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

Read Also: పేద రైతులకు ఫ్రీగా ట్రాక్టర్లు, మాట నిలబెట్టుకున్న లారెన్స్, నిజంగా మీరు దేవుడు సామీ!

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget