అన్వేషించండి

Raghava Lawrence: పేద రైతులకు ఫ్రీగా ట్రాక్టర్లు, మాట నిలబెట్టుకున్న లారెన్స్, నిజంగా మీరు దేవుడు సామీ!

నిరు పేదలకు అండగా నిలవడంలో ముందుండే రాఘవ లారెన్స్, మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. పేద రైతుకు ఉచితంగా ట్రాక్టర్ అందజేసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.

Raghava Lawrence Help: రాఘవ లారెన్స్. మంచి మనసున్న సినీ స్టార్. కొరియోగ్రాఫర్ గా, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. అనాథలు, వికలాంగులతో పాటు ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు. సాయం కోరి వచ్చిన వారిని లేదనకుండా ఆదుకుంటున్నారు. ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మందికి చేయూతనందిస్తున్నారు. కొద్ది రోజు క్రితమే పలువురు దివ్యాంగులకు ఎలక్ట్రిక్ వాహనాలను అందించారు. మరో 10 మంది దివ్యాంగులకు ఇండ్లు కట్టించి అందించారు. ఎంతో మంది అనాథలను ఒక్కచోటకు చేర్చి, ఆనాథాశ్రమాలను నిర్వహిస్తున్నారు లారెన్స్. హీరోగానే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు.

పేద రైతుకు ట్రాక్టర్ అందించిన లారెన్స్

తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు లారెన్స్. ఓ పేద రైతుకు ట్రాక్టర్ బహుమతిగా అందించారు. తమిళనాడులోని విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి ఈ ట్రాక్టర్ ను అందించారు. అతడు తన చెల్లి భర్త చనిపోవడంతో ఆమెతో పాటు తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న లారెన్స్ రాజకన్నన్ కు ట్రాక్టర్ ను బహుమతిగా అందించారు. ఆ రైతు కళ్లల్లో ఆనందం చూసి మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "మిత్రులు, అభిమానులకు నమస్కారం. గతంలో నేను చెప్పినట్టుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న 10 మంది రైతులకు ట్రాక్టర్లు అందజేస్తాను. అందులో భాగంగా తొలి ట్రాక్టర్ ను విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించాం. అతను తన చెల్లి భర్త చనిపోవడంతో తన కుటుంబంతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా తనే పోషిస్తున్నారు. తను కొత్త ట్రాక్టర్ ను నడుపుతూ నవ్వే ముఖాన్ని  చూడాలని వ్యక్తిగతంగా కోరుకున్నాను. అందుకే అతడి కుటుంబాన్ని పిలిచి ట్రాక్టర్ ను అందించాం. అందరం కలిసి రైతులకు అండగా నిలుద్దాం” అని రాసుకొచ్చారు.

10 మంది రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందిస్తానని చెప్పిన లారెన్స్

లారెన్స్ కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా 10 మంది పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందిస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు నేరవేరుస్తున్నారు లారెన్స్. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. లారెన్స్ నిస్వార్థ సేవ పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలాంటి గొప్ప మనుషుల పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

ఓవైపు సేవా కార్యక్రమాల్లో ముందుంటూనే,మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉంటున్నారు లారెన్స్. ఆయన ప్రస్తుతం ‘బెంజ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాను బక్యరాజ్‌ కన్నన్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథను అందిస్తున్నారు.  

Read Also: ‘పుష్ప 2‘ సాంగ్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్, స్పందించిన అల్లు అర్జున్ - నెటిజన్లకు ఫుల్ ఫన్

టాప్ హెడ్ లైన్స్

NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Vishwanath And Sons Pre Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు
విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget