TEST OTT Release Date: ఏప్రిల్‌లో 'టెస్ట్' రిలీజ్... డైరెక్టుగా ఓటీటీలోకి నయన్, సిద్ధార్థ్, మాధవన్ మూవీ, ఎప్పుడు చూడొచ్చంటే?
Test Movie OTT Platform: సిద్ధార్థ్, మాధవన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన 'టెస్ట్' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

నయనతార (Nayanthara), సిద్ధార్థ్, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన కోలీవుడ్ మూవీ 'టెస్ట్' (Test Movie). ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా గురువారం రోజు మేకర్స్ వెల్లడించారు. ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ ను, అలాగే మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ని వెల్లడించారు.
'టెస్ట్' ఓటీటీ రిలీజ్ డేట్
క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ శశికాంత్ రూపొందిస్తున్న మూవీ 'టెస్ట్'. ఈ నిర్మాత ఫస్ట్ టైం 'టెస్ట్' మూవీతో డైరెక్టర్ గా మెగా ఫోన్ పెట్టారు. చెన్నైలోని క్రికెట్ స్టేడియంలో టీం ఇండియా టెస్ట్ మ్యాచ్ జరగడం, ఆ మ్యాచ్ వల్ల ముగ్గురు జీవితాల్లో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి? ఆ మ్యాచ్ చూడడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎలాంటి సమస్యల్లో పడ్డారు? వాటిని ఎలా దాటారు? అనే విషయాలను డైరెక్టర్ ఈ మూవీలో చూపించి, ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నారు. ఈ మూవీలో స్టోరీ మొత్తం ఒకేరోజు సాగుతుందని సమాచారం. ఇక ఈ మూవీకి శశికాంత్ దర్శకత్వం వహిస్తూనే మరోవైపు చక్రవర్తి రామచంద్రతో కలిసి నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు ఆయనే రచయిత కూడా.
Also Read: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
2024 లోని షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ కారణంతోనే థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన 'టెస్ట్' మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక తాజా అనౌన్స్మెంట్ ప్రకారం 'టెస్ట్' మూవీని తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మూవీలో నయనతార, మాధవన్, సిద్ధార్థతో పాటు మీరా జాస్మిన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. 'టెస్ట్' మూవీని ఏప్రిల్ 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టుగా పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఆ పోస్టర్లో మాధవన్, సిద్ధార్థ, నయనతార సీరియస్ గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే క్రికెట్ బ్యాట్, వికెట్లు కూడా పోస్టర్లో కనిపిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నిర్మాత నుంచి దర్శకుడిగా టర్న్
ఈ సందర్భంగా డైరెక్టర్ శశికాంత్ మాట్లాడుతూ "ఇంతకాలం నిర్మాతగా కంటెంట్ బేస్డ్ సినిమాలను చేస్తూ వస్తున్న నేను 'టెస్ట్' మూవీతో డైరెక్టర్ గా మారడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది ఒక పెద్ద టెస్ట్. ఆలోచనలు, తీసుకునే నిర్ణయాల ఎఫెక్ట్ లైఫ్ పై ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాము. అదే అన్నింటికంటే పెద్ద పరీక్ష. ఫస్ట్ టైం నయనతార, మాధవన్, లాంటి పవర్ హౌజ్ ను ఓకే ఫ్రేమ్ లోకి ఈ సినిమా ద్వారా తీసుకొచ్చాము. దీంతో ఈ జర్నీ నాకు మరింత స్పెషల్ అయింది. నాకు ఈ విజన్ లో సహాయం చేసిన సినిమా బ్యానర్ వై నాట్ స్టూడియోస్, అలాగే నా టీం అందరికీ కృతజ్ఞతలు" అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Also Read:ఒరిస్సాలో అడుగు పెట్టిన మహేష్... రాజమౌళి సినిమా కోసం, ఆయనతో వెళ్లిందెవరో గుర్తు పట్టారా?





















