అన్వేషించండి

Su From So OTT: ఓటీటీలోకి రూ.100 కోట్ల హారర్ కామెడీ థ్రిల్లర్ 'సు ఫ్రమ్ సో' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?

Su From So OTT Platform: కన్నడ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'సు ఫ్రమ్ సో' శుక్రవారం ఓటీటీలోకి వస్తుందని భావించినా స్ట్రీమింగ్ కాలేదు. తాజాగా, అధికారికంగా కొత్త స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

Kannada Horror Comedy Su From So OTT Release On Jio Hotstar: ఇటీవల చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ ఏది అంటే కచ్చితంగా గుర్తొచ్చేది కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ 'సు ఫ్రమ్ సో'. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు అన్నీ భాషల్లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శుక్రవారం ఓటీటీలోకి వస్తుందని భావించినప్పటికీ ఆడియన్స్‌కు నిరాశే మిగిలింది. 

ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. కన్నడ, తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో సంధ్య ఆరకెరె, జేపీ తుమినాడ్, ప్రకాశ్ తుమినాడ్, శనీల్ గౌతమ్, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. జెపి తుమినాడ్ దర్శకత్వం వహించగా... లైట్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్‌‌పై రాజ్ బి శెట్టి నిర్మించారు. సందీప్ తులసిదాస్ మ్యూజిక్ అందించారు. 

జులై 25న కన్నడలో రిలీజై సంచలన విజయం సాధించగా తెలుగు ఆడియన్స్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆగస్ట్ 8న రిలీజ్ చేసింది. రూరల్ కామెడీ బ్యాక్ డ్రాప్‌తో 'సు ఫ్రమ్ సో' అందరినీ కడుపుబ్బా నవ్వించింది.

Also Read: 'సైమా అవార్డ్స్ 2025' విన్నర్స్ లిస్ట్: 'పుష్ప 2'కు నాలుగు... సత్తా చాటిన 'కల్కి', 'హనుమాన్'

రూరల్ కామెడీ స్టోరీ

జానపదం, గ్రామాల్లో మూఢ నమ్మకాలు బ్యాక్ డ్రాప్‌గా 'సు ఫ్రమ్ సో' అందరినీ కాస్త భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించింది. ఇక కథ విషయానికొస్తే... కర్ణాటకలోని దర్శస్థలి ప్రాంతంలో ఓ పల్లెటూరు. గ్రామంలో ఉండే అశోక్ (జె పి తుమినాడ్) ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ తన లవర్ ఇంటి దగ్గర ఆగి ఆమెను చూడాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆ ఇంటి బాత్రూం నుంచి ఆ అమ్మాయి గొంతు వినిపించడంతో దొంగతనంగా ఆమెను చూసేందుకు యత్నిస్తాడు. ఇలా చేస్తున్న టైంలోనే అతన్ని ఇద్దరు పట్టుకుంటారు.

దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు తనకు దెయ్యం పట్టినట్లుగా అశోక్ డ్రామా ఆడతాడు. ఈ విషయం తెల్లారేసరికి ఊరంతా పాకిపోతుంది. ఆ దెయ్యాన్ని వదిలించాలని ప్రయత్నాలు మొదలుపెడతారు ఊరి పెద్దలు. గ్రామ పెద్ద రవన్న (షానిల్ గౌతమ్) సిటీ నుంచి కరుణాజీ స్వామీజీ (రాజ్ బి శెట్టి)ని తీసుకొచ్చి దెయ్యాన్ని వదిలించాలంటాడు. అసలు అశోక్‌ను నిజంగా దెయ్యం ఆవహించిందా? దెయ్యంగా అతని చేష్టల వల్ల ఊరి వారు పడ్డ ఇబ్బందులు ఏంటి? కరుణాజీ స్వామీ దెయ్యాన్ని వదిలించేందుకు చేసింది ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మధ్యలో వచ్చే ట్విస్టులు ఆద్యంతం సర్ ప్రైజ్ ఇస్తాయి. చిన్న కథను రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వించేలా రూపొందించారు మేకర్స్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Embed widget