Stand Up Rahul OTT Release: ఆహాలో 'స్టాండప్ రాహుల్', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'ఆహా' ఓటీటీలో 'స్టాండప్ రాహుల్' రిలీజ్ స్ట్రీమింగ్ కానుంది. ఎప్పుడు? అంటే...
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'స్టాండప్ రాహుల్'. అందులో ఆయన స్టాండప్ కమెడియన్ రోల్ చేశారు. ఆయనకు జంటగా వర్షా బొల్లమ్మ నటించారు. మార్చి 18న థియేటర్లలో విడుదలైందీ సినిమా! ఏప్రిల్ 8న ఓటీటీలో విడుదల కానుంది. సాధారణంగా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో సినిమాను విడుదల చేయాలని కొంత మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రూల్ పెట్టుకున్నారు. అయితే... కొన్ని సినిమాలు నెల కంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఆ జాబితాలోకి 'స్టాండప్ రాహుల్' కూడా చేరుతోంది.
థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు ఓటీటీలోకి 'స్టాండప్ రాహుల్' వస్తోంది. థియేటర్లలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రాజ్ తరుణ్ నటనకు మంచి పేరు వచ్చినప్పటికీ... కామెడీ సీన్లు వర్కవుట్ అవ్వలేదని విమర్శకులు తెలిపారు. అయితే... ఓటీటీ వీక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
'స్టాండప్ రాహుల్' సినిమాలో రాజ్ తరుణ్ తండ్రిగా మురళీ శర్మ, తల్లిగా ఇంద్రజ నటించారు. కీలక పాత్రలో 'వెన్నెల' కిషోర్ కనిపించారు. 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' దర్శకుడు వెంకటేష్ మహా ఒక పాత్రలో కనిపించడం విశేషం. ఆయన కూడా స్టాండప్ కమెడియన్ రోల్ చేశారు.
Also Read: ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్, యాక్సిడెంట్ తర్వాత తొలిసారి సెట్స్‌కు
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.