3 Roses Series Season 2: నా అన్వేషణ To అలేఖ్య చిట్టి పికిల్స్ వరకూ.. - వైరల్ కంటెంట్ ఫుల్లుగా వాడేసిన 'బెట్టింగ్ భోగి'
3 Roses Series Season 2 Teaser: హిట్ వెబ్ సిరీస్ '3 రోజెస్' నుంచి కమెడియన్ సత్య క్యారెక్టర్ గ్లింప్స్ మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. 'బెట్టింగ్ భోగి'గా ఆయన రోల్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.

Satya As Betting Bhogi In 3 Roses Series Season 2: టాలీవుడ్ హీరోయిన్స్ ఈషారెబ్బా, పాయల్ రాజ్ పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ '3 రోజెస్'. 'ఆహా' ఓటీటీలో ఫస్ట్ సీజన్ మంచి రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు సెకండ్ సీజన్ రాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా సత్య రోల్‌కు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
నా అన్వేషణ నుంచి అలేఖ్య చిట్టి పికెల్స్ వరకూ..
ఈ సిరీస్‌లో సత్య బెట్టింగ్ భోగిగా కనిపించనున్నారు. ఇందులో ఫేమస్ యూట్యూబర్ అన్వేష్ డైలాగ్స్ నుంచి అలేఖ్య చిట్టి పికెల్స్ వరకూ రీసెంట్ వైరల్ కంటెంట్‌ను ఫుల్లుగా వాడేయగా నవ్వులు పూయిస్తోంది. బెట్టింగ్ ఆడడం చట్టరీత్యా నేరం.. మీతో పాటు మీ కుటుంబానికి కూడా ప్రమాదకరం.. అంటూ హెచ్చరిస్తూనే.. 'హలో బుకీ.. రేట్ కితనా?' అని బెట్టింగ్ భోగి అడగడంతో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం కామెడీ పండించింది.
బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలను కామెడీ వేలో చూపిస్తూ 'బెట్టింగ్ భోగి'ని ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారు మేకర్స్. ఈ క్యారెక్టర్ హిలేరియస్‌గా ఉండి నవ్విస్తోంది. సత్యను ఫస్ట్ టైం ఓ వెబ్ సిరీస్‌లో చూపిస్తున్నారు. ఈ సిరీస్‌లో హీరోయిన్ రాశీ సింగ్ భర్తగా సత్య నటిస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్స్ పెట్టే 'బెట్టింగ్ భోగి'గా మనం రియల్ లైఫ్‌లో చూసే ఎంతోమందిని గుర్తు చేశారు. రాశీ సింగ్, సత్య మధ్య వచ్చే సీన్స్ అన్నీ వైరల్ కంటెంట్ డైలాగ్స్‌తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నాయి. 'విశ్వంభర', 'రాజాసాబ్', 'పెద్ది' వంటి ప్రెస్టీజియస్ మూవీస్‌లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నా సత్య.. 'త్రీ రోజెస్' కంటెంట్‌ను ఇష్టపడి ఈ వెబ్ సిరీస్‌లో నటించారు. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.
He ruled the big screen, now he’s ready to conquer OTT! 😎
— ahavideoin (@ahavideoIN) May 27, 2025
Comedy gets a wild twist as #Satya steps into the shoes of “Betting Bhogi” in #3RosesS2 💰❤️🔥
The teaser is out now – https://t.co/yE3reqST5Q@MassMovieMakers @DirectorMaruthi @SKNonline @YoursEesha @kushithakallapu… pic.twitter.com/CuzUSAqaFS
ఈ సిరీస్‌లో ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా.. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ముగ్గురమ్మాయిల చుట్టూ తిరిగే స్టోరీతో ఫస్ట్ సిరీస్ రాగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు కొత్త సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.





















