Akhil Akkineni: అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్స్! - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Akhil Zainab Ravdjee: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబరులో జైనాబ్ రావ్‌జీతో నిశ్చితార్థం జరగ్గా జూన్ మొదటి వారంలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం.

Akhil Akkineni Zainab Ravdjee Marriage Date Locked: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గతేడాది ప్రముఖ బిజినెస్ మ్యాన్ జూల్ఫీ రవ్‌జీ కుమార్తె జైనాబ్ రావ్‌జీతో గతేడాది నవంబరు ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెళ్లి అప్పుడేనా..
వీరి వివాహం జూన్ 6న జరగనుందనే టాక్ వినిపిస్తోంది. వీరి వెడ్డింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుందని కొందరు.. కాదు, రాజస్థాన్‌లోని ప్రత్యేక ప్యాలెస్‌లో జరుగుతుందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎంగేజ్మెంట్ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగ్గా.. నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరు పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దరూ పలుమార్లు ఎయిర్‌పోర్టులో జంటగా కనిపించారు. తాజాగా.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుండగా అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే.. పెళ్లి అంటే హడావుడి, పెళ్లి పత్రిక ఇతర ఫోటోలు ఎక్కడో చోట హల్చల్ చేస్తాయని అలాంటివేమీ లేవని.. కాబట్టి ఇది రూమర్ మాత్రమే అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. అఖిల్ ఇప్పటివరకూ 5 సినిమాలు చేశారు. వీటిలో ఒక్కటి తప్ప మిగతావి అనుకున్నంత విజయం సాధించలేదు. చివరిసారిగా 'ఏజెంట్' మూవీలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రస్తుతం 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
మాస్ లుక్.. లెనిన్
ఇక ఆరో సినిమా 'లెనిన్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. దట్టమైన మీసం, పొడవాటి జుట్టుతో ఫుల్ మాస్ లుక్‌లో అఖిల్ అదరగొట్టారు. రాయలసీమ యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సీమ బ్యాక్ డ్రాప్‌లో లవ్, మాస్ ఎంటర్‌టైనర్‌గా మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సినిమా నిర్మిస్తున్నారు.
అఖిల్ అక్కినేని ఖాతాలో ఇప్పటివరకూ సరైన హిట్ పడలేదు. ఈ మూవీతోనైనా ఆయన సూపర్ హిట్ కొట్టాలని అక్కినేని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఇక టైటిల్ గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉండడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటివరకూ చూడని ఊర మాస్ లుక్‌లో అఖిల్‌ను చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. అఖిల్ సరసన బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.






















