Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
Satluj OTT Platform : మూడేళ్ల క్రితం సెన్సార్ అభ్యంతరాలతో రిలీజ్ ఆగిపోయిన మూవీ ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకూ ఏంటా సినిమా... ఏంటా వివాదం అనేది చూస్తే...

Diljit Dosanjh's Satluj OTT Streaming : బాలీవుడ్ నటుడు దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్. మూడేళ్ల క్రితం పలు కాంట్రవర్సీలకు నోచుకోని మూవీ... ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఆడియన్స్ కోసం సరికొత్త టైటిల్‌తో ఓటీటీలోకి వచ్చేసింది. అసలేంటా మూవీ... ఆ కథేంటంటే...
పంజాబ్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా 'పంజాబ్ 95' అనే మూవీని రూపొందించారు. ఈ సినిమాకు హనీ టెహ్రాన్ దర్శకత్వం వహించగా... దిల్జీత్ దోసాంజ్‌తో పాటు అర్జున్ రాంపాల్, సువిందర్ విక్కీ, కన్వల్ జీత్ సింగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. అప్పట్లే సెన్సార్ బోర్డ్ స్టోరీపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ... 127 కట్స్ సూచించింది. టైటిల్‌తో పాటు కీలక సీన్స్, డైలాగ్స్ డిలీట్ చేయాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. దీనికి మూవీ టీం కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా సెన్సార్ సభ్యులు అంగీకరించలేదు. ఎన్నో ఆంక్షల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్.
'పంజాబ్ 95' టైటిల్‌ను 'సట్లెజ్' (Satluj)గా మార్చారు మేకర్స్. ఎలాంటి కట్స్ లేకుండా ప్రముఖ ఓటీటీ ZEE5లో గురువారం (జులై 3) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మూడేళ్ల తర్వాత వచ్చిన మూవీకి నార్త్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీనిపై మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్టోరీ ఏంటంటే?
పంజాబ్ చరిత్రలో 1984 - 1994 మధ్య జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోలీసులపై వచ్చిన ఆరోపణలపై జస్వంత్ సింగ్ ఖల్రా పరిశోధన, వేలాది మంది అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఆయన ఛేదించారు. ఈ క్రమంలోనే ఆయన కూడా 1995లో అదృశ్యం అయ్యారు. పోలీసులే ఆయన్ను హతమార్చారనే ఆరోపణలపై సుదీర్ఘ విచారణ జరిగింది. చివరకు 2005లో నలుగురు పోలీస్ అధికారులకు కోర్టు శిక్ష విధించింది. సెన్సిటివ్ కథాంశంతో తెరకెక్కడంతో ఈ మూవీ వివాదాలకు కారణమైంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























