అన్వేషించండి

Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?

Ye Devi Varamo Neevu : హీరోయిన్ సంజన బుల్లితెరకు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌తో రాబోయే ఫ్యామిలీ డ్రామా సోమవారం నుంచి టెలికాస్ట్ కానుంది.

Actress Sanjana Telugu Debut Serial Ye Devi Varamo Premiere Details : హీరోయిన్, బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, తల్లీకూతుళ్ల సెంటిమెంట్ ప్రధానాంశంగా రూపొందించిన సరికొత్త సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది.

ప్రైమ్ టైమ్‌లో...

ఇప్పటికే విభిన్న కథాంశాలతో కూడిన సీరియళ్లతో బుల్లితెర ఆడియన్స్‌ను అలరిస్తున్న 'స్టార్ మా' (Star Maa)లో ప్రైమ్ టైమ్‌లో ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది. సోమవారం (జులై 6) నుంచి ప్రారంభం కానుండగా... శనివారం వరకూ ప్రతీ రోజూ రాత్రి 8:30 గంటలకు ప్రీమియర్ కానుంది. కొత్త సీరియల్ రాకతో టాప్ ట్రెండింగ్ సీరియల్స్ టైమింగ్స్ ఛేంజ్ కానున్నాయి. 'ఇంటింటి రామాయణం' సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి... 'నిండు మనసులు' మధ్యాహ్నం 2:30 గంటలకు టెలికాస్ట్ కానుంది.

Also Read : Aamir Khan : ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో వివాహం - ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితుల మధ్య సింపుల్‌గా...

కన్నడకు చెందిన హీరోయిన్ సంజన గల్రానీ 2005లో సోగ్గాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రభాస్ 'బుజ్జిగాడు'లో హీరోయిన్ చెల్లెలిగా నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ఆరోగ్య సమస్యలు, పెళ్లి, పిల్లలు... ఇలా పలు కారణాలతో కెరీర్ పరంగా గ్యాప్ తీసుకున్నారు. రీసెంట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మెరిశారు. తనదైన గేమ్‌తో అలరించారు. ఇప్పుడు సీరియల్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 

'ఏ దేవి వరమో నీవు' కథేంటంటే?

తల్లీ కూతుళ్ల సెంటిమెంట్ ప్రధానాంశంగా ఈ సీరియల్ సాగనున్నట్లు ప్రోమోను బట్టి తెలుస్తోంది. సమాజంలో పేరు, డబ్బున్న వ్యక్తి కూతురు గీతాంజలి. ప్రేమికుడు మోసం చేయడంతో ఓ ఆడబిడ్డకు జన్మనిస్తుంది. అయితే, ఈ విషయం తెలిస్తే సొసైటీలో పరువు, ప్రతిష్టల ఎక్కడ మంటగలిసి పోతాయో అని భయపడిన ఆమె తండ్రి... పాపను వారసురాలిగా అంగీకరించేందుకు నిరాకరిస్తాడు. పుట్టిన వెంటనే తల్లి కళ్లు తెరవక ముందే పాపను అనాథాశ్రమంలో వదిలేస్తాడు.

పుట్టిన వెంటనే బిడ్డ చనిపోయిందని గీతాంజలిని నమ్మిస్తారు. అనాథగా పెరిగిన చిన్నారి పెద్దదై పాతికేళ్ల తర్వాత మళ్లీ తల్లి ఇంటికే చేరుకోవాల్సి వస్తుంది. అనాథగా ఆ పాప పడిన ఇబ్బందులు తీరి అమ్మ ప్రేమకు దగ్గరవుతుందా? అసలు కన్న కూతురిని గీతాంజలి గుర్తు పడుతుందా? అమ్మ ప్రేమ కోసం ఆరాటపడే ఆ అమ్మాయికి తల్లి ప్రేమ దక్కుతుందా? కాలం తల్లీకూతుళ్లను ఒక్కటి చేసిందా? అనేది తెలియాలంటే సీరియల్ చూడాల్సిందే.

Also Read : Sing Geetham OTT : సింగ్ గీతం ఓటీటీ రిలీజ్ - థియేటర్ వెర్షన్ కంటే వెరీ డిఫరెంట్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు శశి వార్నింగ్‌ - లక్కీని కొట్టబోయిన మదన్‌  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు శశి వార్నింగ్‌ - లక్కీని కొట్టబోయిన మదన్‌  
Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget