అన్వేషించండి

Samantha: వరుణ్ ధావన్‌తో సమంత స్పెషల్ పోస్ట్ - ఆ వెబ్ సిరీస్ గురించేనా?

Citadel India: వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్న సిరీస్ ‘సిటాడెల్’. ఇప్పటివరకు ఈ సిరీస్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా తాజాగా దీని గ్లింప్స్ సిద్ధమయినట్టు సమంత షేర్ చేసిన పోస్ట్ చూస్తే అర్థమవుతోంది

Citadel India Glimpse: ప్రస్తుతం సమంత చేతిలో సినిమాలు ఏమీ లేవు. ఒక్క వెబ్ సిరీస్‌తో మాత్రమే తను బిజీగా ఉంది. అదే ‘సిటాడెల్’. సమంత, వరుణ్ దావణ్.. ఈ సిరీస్‌లో జంటగా నటిస్తున్నారు. రాజ్, డీకే.. ఈ మూవీకి దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ‘సిటాడెల్’ నుండి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. కానీ మొదటిసారి షూటింగ్ పూర్తయినట్టు, టీమ్ అంతా కలిసి గ్లింప్స్ చూసినట్టుగా ఫోటోలు షేర్ చేశారు. ఇక షూటింగ్ పూర్తయ్యి.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో అడుగుపెట్టడంతో త్వరలోనే ‘సిటాడెల్’ ప్రేక్షకుల ముందుకు రానుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన గ్లింప్స్ గురించి సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఫైనల్‌గా చూడడానికి కుదిరింది..

తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులో తనతో పాటు రాజ్, డీకే, వరుణ్ ధాన్ కలిసి ఏదో చూస్తున్నారు. వాళ్లు చూసేది ఏంటో రిలీల్ చేయలేదు కానీ.. అది కచ్చితంగా ‘సిటాడెల్’కు సంబంధించిన గ్లింప్స్ అని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. ‘ఈరోజు ఫైనల్‌గా ఒకటి చూడడానికి కుదిరింది. అది చూసిన తర్వాత మాకు సంతోషంగా ఉంది’ అంటూ అందరితో దిగిన ఫోటోలను సమంతతో పాటు వరుణ్ ధావన్ కూడా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇక ‘సిటాడెల్’లో తన పాత్రకు డబ్బింగ్ కూడా ప్రారంభించినట్టుగా సమంత మరో అప్డేట్‌ను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంది. దీనికి ‘లెట్స్ గో’ అంటూ క్యాప్షన్‌ను యాడ్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

అమెరికన్ వెబ్ సిరీస్‌కు రీమేక్..

ఇక ‘సిటాడెల్ ఇండియా’ వెబ్ సిరీస్‌లో సమంత, వరుణ్ ధావన్‌తో పాటు సిఖందర్ ఖేర్, ఎమ్మా క్యానింగ్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెర్బియా, ఇండియాలో ఈ సిరీస్ షూటింగ్ జరిగింది. ఇది ‘సిటాడెల్’ అనే అమెరికన్ వెబ్ సిరీస్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. అందులో రిచార్డ్ మాడ్డెన్, ప్రియాంక చోప్రా హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ వెబ్ సిరీస్ స్పెషల్ స్క్రీనింగ్‌లో సమంతతో పాటు వరుణ్ ధావన్ కూడా పాల్గొన్నాడు. ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల దగ్గర నుండి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ఇక ‘సిటాడెల్ ఇండియా’కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా.. రాజ్, డీకే ఎలాంటి మార్పులు చేశారా అని సమంత ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్..

అమెజాన్ ప్రైమ్‌లో ‘సిటాడెల్ ఇండియా’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కానీ స్ట్రీమింగ్ ఎప్పటినుండి ప్రారంభమవుతుంది అనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. ఇక రాజ్, డీకేలతో కలిసి సమంత ఇంతకు ముందే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్‌తోనే సామ్ వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టింది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ కోసం మొదటిసారి విలన్‌గా మారింది ఈ భామ. ఇందులో సమంత నటనకు బాలీవుడ్ ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. అందులో తను చేసిన రాజీ అనే పాత్రకు సమంతకు బాలీవుడ్‌లో విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరోసారి అదే దర్శకులతో కలిసి ‘సిటాడెల్’ చేసింది. మరి ఈ ముగ్గురి కాంబినేషన్ మరోసారి అదే రేంజ్‌లో హిట్ అవుతుందేమో చూడాలి.

Also Read: ‘వార్ 2’ షూటింగ్ ముహూర్తం ఫిక్స్? ఎన్టీఆర్ కోసం హృతిక్ వెయిటింగ్!

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
72nd National Award Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
National Awards Telugu Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
CM Vijay WhatsApp Bribe Buster: సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
రూ.6 లక్షల లోపే మంచి ఫ్యామిలీ SUV - మన దేశంలో 8 లక్షల మంది ఎంపిక చేసుకున్న కారు
8 లక్షల మంది కొన్న ఫ్యామిలీ SUV, యూత్‌కీ ఇష్టమే - రేటు కూడా రూ.5.70 లక్షలే!
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Embed widget