Ritika Singh: నేరుగా ఓటీటీలోకి రితికా సింగ్ హారర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Valari: ఇప్పటికే ‘శివలింగ’ అనే హారర్ మూవీలో దెయ్యంగా నటించి భయపెట్టింది హీరోయిన్ రితికా సింగ్. ఇప్పుడు మరోసారి ‘వళరి’ అనే మరో హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
![Ritika Singh: నేరుగా ఓటీటీలోకి రితికా సింగ్ హారర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే? ritika singh starrer horror movie valari streaming date is out now Ritika Singh: నేరుగా ఓటీటీలోకి రితికా సింగ్ హారర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/1b40f8ad188b706d1b41c54e8b9658981707811871642802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Valari Movie on ETv Win: ఈమధ్య ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా కంటెంట్ ఉన్న కథలకే ఓటు వేస్తున్నారు. అందుకే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా అలర్ట్ అయ్యాయి. ఎక్కువగా కంటెంట్ ఉన్న కథలతోనే సబ్‌స్క్రైబర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. థియేటర్లలో విడుదలయిన సినిమాలు మాత్రమే కాకుండా ఒరిజినల్స్ పేరుతో సొంతంగా కంటెంట్‌ను క్రియేట్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. అందులో ఈటీవీ విన్ కూడా ఒకటి. ఇప్పటికే '#90స్’ అనే వెబ్ సిరీస్‌తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న ఈటీవీ విన్.. ఇప్పుడు ఏకంగా ఒక హారర్ కథతో భయపెట్టడానికి వచ్చేస్తోంది. రితికా సింగ్ హీరోయిన్‌గా నటించిన ‘వళరి’ త్వరలోనే ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమవుతోంది.
గతంలో ఏం జరిగింది.?
‘మునుపెన్నడూ చూడని హారర్ జర్నీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. వళరి అంటే కేవలం భయపెట్టే సీన్స్ మాత్రమే కాదు.. ఇదొక మతిపోగొట్టే, గుండెను గట్టిగా కొట్టుకునేలా చేసే డిఫరెంట్ కథ’ అంటూ కొన్నిరోజుల క్రితం ‘వళరి’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీలోని రితికా సింగ్ క్యారెక్టర్‌ను పరిచయం చేయడంతో పాటు మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను కూడా బయటపెట్టారు. ఈ హారర్ సినిమాలో రితికా సింగ్.. దివ్య అనే పాత్రలో కనిపించనున్నట్టు సోషల్ మీడియా ద్వారా ఒక కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ‘దివ్యను కలవండి. తను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. చాలా మంచిది. మరి తన గతం పరిస్థితి ఏంటి?’ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో రితికా సింగ్ పోస్టర్ విడుదలయ్యింది.
View this post on Instagram
కొత్త దర్శకురాలితో..
ఈటీవీ విన్‌లో ‘వళరి’ మార్చి 6 నుండి స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుందని ప్రకటించింది. ఇందులో రితికా సింగ్‌తో పాటు శ్రీరామ్, సుబ్బరాజు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మూవీ నుండి విడుదలయిన ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇక తాజాగా విడుదలయిన రితికా సింగ్ క్యారెక్టర్ పోస్టర్ కూడా హారర్ అంశాలతో డిజైన్ చేసి హారర్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకున్నారు. ‘వళరి’తో మృతికా సంతోషిని.. ఈ మూవీ ద్వారా దర్శకురాలిగా పరిచయం కానుంది. ఇప్పటికే రితికా సింగ్ కెరీర్‌లో రాఘవ లారెన్స్‌తో కలిసి ‘శివలింగ’ అనే హారర్ మూవీలో నటించింది. అందులో దెయ్యంగా భయపెట్టింది. ఇప్పుడు మరోసారి ఓ హారర్ కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోసారి ఓటీటీ కంటెంట్‌తో..
ప్రొఫెషనల్ బాక్సర్ అయిన రితికా సింగ్.. ‘సాలా కడూస్’ అనే మూవీతో హీరోయిన్‌గా మారింది. మొదటి సినిమాలోనే తను ప్రొఫెషనల్ యాక్టర్ కూడా అనిపించేలా చేసింది. దీంతో తనకు తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. ‘సాలా కడూస్’ చిత్రాన్ని తెలుగు రీమేక్ అయిన ‘గురు’లో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనకు ఏడాదికి ఒక సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమాలు కూడా హిట్ అవుతూనే వచ్చాయి. అయినా తనకు హీరోయిన్‌గా తగినంత గుర్తింపు దక్కలేదు. దీంతో గతేడాది ‘స్టోరీ ఆఫ్ థింగ్స్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ కంటెంట్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరోసారి ఈటీవీ విన్‌లో విడుదలవుతున్న ‘వళరి’ అనే హారర్ మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
Also Read: ఆ పోర్న్‌స్టార్‌తో రణవీర్ సింగ్ యాడ్ - ఇది పెద్దలకు మాత్రమే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)