Ramabanam OTT Release Date : ఎట్టకేలకు గోపీచంద్ 'రామబాణం' మూవీకి మోక్షం - త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా
గోపీచంద్ నటించిన రీసెంట్ మూవీ 'రామబాణం' ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 14 నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తున్నారు.
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ మూవీ 'రామబాణం' కి ఎట్టకేలకు ఓటీటీ మోక్షం లభించింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వేసవి కానుకగా మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా థియేటర్స్ లో గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి శ్రీవాస్ - గోపీచంద్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'లక్ష్యం', 'లౌక్యం' సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని తెలియడంతో 'రామబాణం'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా ఈ మూవీతో హ్యాట్రిక్ సాధిస్తారని అంతా భావించారు.
కానీ ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకుని నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు, కుష్బూ కీలక పాత్రలు పోషించారు. గోపీచంద్ నుంచి ఆడియన్స్ ఆశించే ఎలివెంట్స్ పెద్దగా లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అనిపించలేకపోయింది. అలాంటి ఈ డిజాస్టర్ మూవీ థియేటర్స్ లో రిలీజై నాలుగు నెలలు కావస్తున్నా ఇంకా ఓటీటీ రిలీజ్ కి నోచుకోలేదు. నిజానికి ఈమధ్య సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా నెల రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇక ప్లాప్ అయిన సినిమాలు అయితే రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్నాయి.
అలాంటిది గోపీచంద్ 'రామబాణం' మూవీ ఇంకా ఓటీటీకి రాలేదు. ఇక ఎట్టకేలకు ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబర్ 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో 'రామబాణం' మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలో ఈ మూవీ స్ట్రీమింగ్ ని అందుబాటులోకి తెస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని విషయం తెలిసి గోపీచంద్ ఫాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమారు రూ.15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ థియేట్రికల్ రన్ లో కేవలం రూ.3 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చి గోపీచంద్ కెరీర్లో మరో డిజాస్టర్ గా నిలిచింది.
Also Read : సిద్ధార్థ్ చేతుల మీదుగా విడుదలైన 'రామన్న యూత్' ట్రైలర్!
ఇక రామబాణం కథ విషయానికొస్తే.. రాజారామ్(జగపతిబాబు) సుఖీభవ పేరుతో హోటల్స్ నడుపుతుంటాడు. అతని పోటీకి తట్టుకోలేని జీకే (తరుణ్ ఆరోరా) రాజారాం (జగపతిబాబు) హోటల్ లైసెన్స్ ఎత్తుకుపోతాడు. జీకే పై రాజారాం తమ్ముడు విక్కీ (గోపీచంద్) దాడి చేస్తాడు. రాజారామ్ అతడిని పోలీసులకు పట్టిస్తాడు. పోలీసుల బారి నుంచి తప్పించుకున్న విక్కీ కోల్కతాకు పారిపోయి, పెద్ద మాఫియా డాన్ గా ఎదుగుతాడు. 15 ఏళ్ల తర్వాత అన్నయ్య కుటుంబాన్ని వెతుక్కుంటూ మళ్లీ విక్కీ ఎందుకు వెనక్కి వచ్చాడు? రాజారామ్ కు శత్రువుల నుంచి ఎలాంటి ఆపద ఎదురైంది? అనేది ఈ సినిమా కథ.
Also Read : చిత్రసీమలో విషాదం - గుండెపోటుతో 'జైలర్' నటుడు కన్నుమూత
Join Us on Telegram: https://t.me/abpdesamofficial