Pochamma Series OTT : ఓటీటీలోకి మిస్టీరియస్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Pochamma Series OTT Platform : మిస్టీరియస్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.

Arjun Ambati's Pochamma Web Series OTT Streaming : ఓ భవనం... అందులో బయటపడ్డ పోచమ్మ తల్లి విగ్రహం... దాని చుట్టూ అల్లుకున్న కథ... సరికొత్త మిస్టీరియస్ థ్రిల్లర్ సిరీస్ 'పోచమ్మ' ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ హైప్ క్రియేట్ చేశాయి.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'పోచమ్మ' సిరీస్ ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ భాషలోనూ అందుబాటులో ఉంది. అయితే, కేవలం గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ మాత్రమే గురువారం నుంచి చూడొచ్చు. సాధాారణ సబ్‌స్కైబర్స్‌కు శుక్రవారం (ఏప్రిల్ 17) నుంచి అందుబాటులోకి రానుంది. 'ఆ భవనంలో అనుకోని ఘటనలు జరగనంత వరకూ అది కేవలం మూఢ నమ్మకం అనుకున్నారు.' అనే క్యాప్షన్‌తో అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా.
ఈ సిరీస్‌కు రమేష్ ఇంద్ర దర్శకత్వం వహిస్తుండగా... అంబటి అర్జున్, స్నేహల్ కామత్, శ్రీపూజా రెడ్డి, విజయ్ సింహా, ప్రియా శతమర్షణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రుతినాయుడు చిత్ర బ్యానర్‌పై శ్రుతి నాయుడు నిర్మించారు.
View this post on Instagram
Also Read : ఓ వారణాసి... ఓ బాహుబలి... రావు బహదూర్ - క్షుద్రపూజలు కూడా చేశా... సత్యదేవ్ కామెంట్స్ వైరల్
స్టోరీ అదేనా?
టీజర్, ట్రైలర్‌ను బట్టి చూస్తే ఓ భవనం... పోచమ్మ వారి విగ్రహం... ఓ శాపం చుట్టూ ఈ స్టోరీ సాగనున్నట్లు తెలుస్తోంది. ఓ భవనంలో పోచమ్మ విగ్రహం వెనుక మిస్టరీ... గ్రామంలో ఉన్న పోచమ్మ వారి విగ్రహాన్ని కొందరు అక్కడి నుంచి తీసి ఓ నదిలో పడేస్తారు. దీంతో ఆ భవనం, స్థలాన్ని అమ్మవారి శాపం వెన్నాడుతుంది. ఈ క్రమంలో ఆ భవనంలోకిి వచ్చిన వారికి విచిత్ర అనుభవాలు ఎదురవుతాయి. అసలు ఆ భవనంలో పోచమ్మ వారి విగ్రహం మిస్టరీ ఏంటి? అమ్మవారు విధించిన శాపం ఏంటి? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
Before You Go
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















