Panchayat Season 4 Web Series Release Date: సూపర్ హిట్ సిరీస్ 'పంచాయత్' సీజన్ 4 వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. స్పెషల్ వీడియో చూశారా?
Panchayat Season 4: సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'పంచాయత్' సీజన్ 4 వచ్చేస్తోంది. ఇప్పటికే వచ్చిన 3 సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కొత్త సీజన్ రిలీజ్‌పై మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు.

Panchayat Season 4 Web Series OTT Release On Amazon Prime Video: ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ కొనసాగుతున్న తరుణంలో కామెడీ, హారర్, థ్రిల్లర్ జానర్లలో మూవీస్, వెబ్ సిరీస్‌లను ప్రముఖ ఓటీటీలు అందుబాటులో ఉంచుతున్నాయి. అలా విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన సిరీస్ 'పంచాయత్' (Panchayat). ఇప్పటికే 3 సీజన్స్ పూర్తి చేసుకోగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
త్వరలోనే 'పంచాయత్ సీజన్ 4' స్ట్రీమింగ్
ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2020లో ఫస్ట్ సీజన్.. సెకండ్ సీజన్ 2022లో.. మూడో సీజన్ 2024లో రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే జోష్‌తో నాలుగో సీజన్ సైతం వస్తోంది. సరికొత్త కామెడీ డ్రామా సిరీస్‌గా వస్తోన్న ఈ సిరీస్ నాలుగో సీజన్ ఈ ఏడాది జులై 2 నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రివీల్ చేస్తూ ఓ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝూ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు.
View this post on Instagram
తెలుగులో 'సివరపల్లి'గా రీమేక్.. స్టోరీ ఏంటంటే?
గ్రామీణ నేపథ్యంలో కామెడీ బ్యాక్ డ్రాప్‌గా సాగే ఈ సిరీస్‌ను తెలుగులో 'సివరపల్లి'గా (Sivarapalli) రీమేక్ చేశారు. ఈ సిరీస్‌లో రాగ్ మయూర్, రూపలక్ష్మి (Roopa Lakshmi), మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు భాస్కర్ మౌర్య ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా.. తెలుగులోనూ ఆకట్టుకుంది. ఇక కథ విషయానికొస్తే.. ఫారిన్ వెళ్లి సెటిల్ కావాలనుకునే ఓ యువకునికి ఓ పల్లెటూరిలో పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం వస్తుంది. అయితే, తన ప్రెండ్స్ సలహా మేరకు ఉద్యోగం చేస్తూనే ఫారిన్ వెళ్లే ప్రయత్నంలో చదువు కొనసాగిస్తాడు.
అయితే, ఆ ఊరి సర్పంచ్, అతని అసిస్టెంట్ చేసే పనులు అతనికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. అంతే కాకుండా ఆ ఊరి వాతావరణంలోనూ ఇమడడానికి ఇబ్బంది పడుతుంటాడు. వాటన్నింటినీ అధిగమంచి మొత్తానికి ఫారిన్ వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఓ పరీక్ష రాస్తాడు. అయితే, అందులో అనుకున్నంత మార్కులు రావు. ఇదే టైంలో తన కూతురుని అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని సర్పంచ్ భావిస్తాడు. అసలు పల్లెటూరి లైఫ్ స్టైల్ ఇష్టం లేని అతను ఎంత త్వరగా వీలైతే అక్కడి నుంచి అంత త్వరగా వెళ్లిపోవాలని అనుకుంటాడు. దీనికి అతను ఏం చేస్తాడు.? అసలు ఫారిన్ వెళ్లే క్రమంలో ఇంకా ఎదురైన సవాళ్లేంటి.? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సింది. ఈ సిరీస్ 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులో ఉంది.





















