అన్వేషించండి

OTT Releases This Week: నయనతార డాక్యమెంటరీ నుంచి టబు హాలీవుడ్ షో వరకూ... ఈ వారం ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్‌లు

నయనతార, ధనుష్ వివాదంతో ‘నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. దాంతో టబు హాలీవుడ్ వెబ్ సిరీస్, లక్కీ భాస్కర్‌తో పాటు ఈ వీక్ ఓటీటీ రిలీజెస్ ఏవో చూడండి.

ప్రతి వారం ఓటీటీలో ఒరిజినల్ మూవీస్, కొత్త వెబ్ సిరీస్‌లు, థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఏవేవీ వస్తున్నాయి? మరి ఈ రోజే స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు ఏంటో తెలుసా?

నయనతార... సెన్సేషనల్ టేల్!

విడుదల తేదీ: నవంబర్ 18, ఓటీటీ వేదిక: నెట్ ఫ్లిక్స్!
‘నయనతార : బియాండ్ ద ఫెయిరీ టేల్’... ఇప్పుడీ డాక్యుమెంటరీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. నయనతార జీవితంలో జరిగిన కొన్ని కీలక సంఘటనలతో పాటు దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమ, పెళ్లి... ఈ పరిణామాలన్నీ డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది నెట్ ఫ్లిక్స్. ఈ సందర్భంగా హీరోలు నాగార్జున, ఉపేంద్ర, రానా, సీనియర్ నటి రాధిక ఇచ్చిన ఇంటర్వ్యూ లు కూడా ఇందులో చూడవచ్చు. ‘నాన్ రౌడీ దాన్’ సినిమా విజువల్స్ ను తన డాక్యుమెంటరీ లో చూపించడానికి చిత్ర నిర్మాత ధనుష్ 10 కోట్లు అడిగారంటూ నయనతార తన సోషల్ మీడియా ఖాతాలో బహిరంగ లేఖ విడుదల చేయడంతో ఈ డాక్యుమెంటరీ పై అందరికీ మరింత ఆసక్తి పెంచింది.

టబు నటించిన ప్రీక్వెల్ వచ్చేసింది.. అదేంటో తెలుసా?

విడుదల తేదీ: నవంబర్ 18, ఓటీటీ వేదిక: జియో సినిమా
‘నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో మరో సారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు టబు. విలక్షణమై పాత్రలతో ఎంచుకుంటున్న టబు తొలిసారిగా ‘ఖుఫియా’  అనే వెబ్ సిరీస్ లో నటించారు. మరో వెబ్ సిరీస్ నూ ఒప్పుకున్నారు. అదే ‘డ్యూన్ ప్రాఫెసీ’. ప్రముఖ ఆంగ్ల రచయిత ఫ్రాంక్ హెర్బెర్ట్ రచనల ఆధారంగా ఇప్పటికే రెండు సినిమాలు రూపొందాయి. మూడో అడాప్టేషన్ గా డెనిస్ ఇటీవల తెరకెక్కించిన ‘డ్యూన్’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. వీటికి ప్రీక్వెల్ గా ‘డ్యూన్: ప్రొఫెసీ’ వెబ్ సిరీస్ సోమవారం విడుదల కానుంది. చక్రవర్తి ప్రేయసి ఫ్రాన్సెస్కా  గా టబు ఈ వెబ్ సిరీస్ లో కనిపిస్తారు. ఆమె పాత్ర  ఈ వెబ్ సిరీస్ కు ఎంతో కీలకమని రూపకర్తలు చెబుతున్నారు. ఇంగ్లిష్, తెలుగు, తమిళం, హిందీ తో పాటు మరిన్ని భారతీయ భాషల్లో చూడవచ్చు.

  • నవంబర్ 23న జీ 5 ఓటీటీలో యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'జీ 5' స్ట్రీమింగ్ కానుంది.
  • అసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన 'కిష్కింద కాండం' ఈ నెల 19న (మంగళవారం) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
  • హిందీ వెబ్ సిరీస్ 'క్యాంపస్ బీట్స్ సీజన్ 2' ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి


మూడు కోతుల కథను చూసేయండి

విడుదల తేదీ: నవంబర్ 19, ఓటీటీ వేదిక: డిస్నీ హాట్ స్టార్!
విభిన్న కథాంశాలను పరిచయం చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో మలయాళీ చిత్ర పరిశ్రమది ఒక ప్రత్యేక శైలి. అలాంటి మిస్టరీ క్రైమ్ కథాంశంతో మరో సినిమా రాబోతోంది. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు.. ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలకు చెప్పే మాట. ఇదే ఇతివృత్తంతో  ఇటీవల విడుదలైన మలయాళీ చిత్రం ‘కిష్కింధకాండం’. ఓ ఫారెస్ట్ ఆఫీసర్ కుటుంబం చుట్టూ  సాగే మర్డర్ మిస్టరీ  కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. ఆసిఫ్ అలీ,‘ఆకాశం నీ హద్దు రా’ ఫేమ్ అపర్ణా బాలమురళీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దినిజిత్ అయ్యతన్ దర్శకుడు.

చైనా టౌన్ మిస్టరీ

విడుదల తేదీ: నవంబర్ 19, ఓటీటీ వేదిక: డిస్నీ హాట్ స్టార్!
కుంగ్ ఫూ యాక్టర్ గా హాలీవుడ్ లో వెలిగిపోవాలని చైనా టౌన్ లోని అడుగుపెట్టిన విల్లిస్ వూ ఓ హోటల్ లో వెయిటర్  గా సెటిల్ అవుతాడు. సీరియల్ హత్యల పరిశోధనలో పోలీసాఫీసర్ కి సహాయం చేస్తాడు విల్లింగ్ వూ. ఆ తర్వాత అతని జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలియాలంటే ‘ఇంటీరియన్ చైనా టౌన్’ చూసేయాల్సిందే.  క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది. చార్లెస్ యూ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో విల్లిస్ వూ పాత్రలో జిమ్మి ఓ యాంగ్ కనిపిస్తారు.

బుల్లితెరపై ఏలియన్స్ కొత్త సినిమా 

విడుదల తేదీ: నవంబర్ 21, ఓటీటీ వేదిక: డిస్నీ హాట్ స్టార్!
ఏలియన్ ఫ్రాంచైస్ కు ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. రిడ్లీ స్కాట్, జేమ్స్ కామెరూన్, డేవిడ్ ఫించర్ వంటి దిగ్దర్శకులు ఈ సిరీస్ లోని సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఏలియన్ ద రోములస్ చిత్రం ఘన విజయం సాధించింది. కేలీ స్పేనీ, డేవిడ్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి‘డోంట్ బ్రీత్’ ఫేమ్ ఫెడే అల్వరెజ్ దర్శకుడు. ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

జోయ్ కథ

విడుదల తేదీ: నవంబర్ 22, ఓటీటీ వేదిక: నెట్ ఫ్లిక్స్!
టెస్ట్ ట్యూబ్  బేబీ... ఇప్పుడు ఎవరికీ పెద్దగా పరిచయం అక్కర్లేని మాట. మరి 60, 70 దశకాల్లో అదొక ప్రయోగం. ఈ ప్రక్రియ గురించి నార్టన్ అనే శాస్త్రవేత్త చెబితే తోటి శాస్త్రవేత్తలతో పాటు సమాజామూ నవ్వింది. అసలీ ప్రయోగం సాధ్యమా అన్నట్లు ప్రశ్నలతో ఉక్కిబిక్కిరిచేసింది. ఆ అవరోధాలూ,  అవమానాలూ దాటుకొని నార్టన్  ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఆ టెస్ట్ బేబీ పేరే ‘లూయిస్ జోయ్ బ్రౌన్’. ఈ  యథార్థ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రం ‘జోయ్’ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.  బెన్ టేలర్ దర్శకుడు.

Also Read: Pushpa 2 Trailer Launch Highlights - పాట్నా ప్రజల ప్రేమకు ఐకాన్ స్టార్ ఫిదా... బన్నీ స్పీచ్ to 2 లక్షల మంది జనాలు, పోలీస్ సెక్యూరిటీ - 'పుష్ప 2' ట్రైలర్ లాంఛ్ హైలైట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Embed widget