Kanyakumari OTT: రెండు ఓటీటీల్లో కన్యాకుమారి స్ట్రీమింగ్... 20 రోజులకే రాక - ఆర్గానిక్ ప్రేమకథను ఎందులో చూడొచ్చంటే?
Kanyakumari OTT Streaming Platforms: హీరోయిన్ మధుశాలిని సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్గానిక్ ప్రేమకథా చిత్రమ్ 'కన్యాకుమారి'. ఇప్పుడీ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

హీరోయిన్ మధుశాలిని తెలుసుగా! తన సమర్పణలో ఓ సినిమాను విడుదల చేశారు ఆవిడ. ఆనంద్ దేవరకొండ హీరోగా 'పుష్పక విమానం' ఫేమ్ సృజన్ దర్శకత్వం వహించిన 'కన్యాకుమారి' నచ్చడంతో సమర్పకురాలిగా మారారు. ఇప్పుడు ఆ మూవీ ఓటీటీలోకి వచ్చింది.
రెండు ఓటీటీల్లో 'కన్యాకుమారి' స్ట్రీమింగ్!
'కన్యాకుమారి' సినిమాలో గీత్ సైని టైటిల్ రోల్ చేశారు. ఆమెకు జంటగా యంగ్ హీరో శ్రీ చరణ్ రాచకొండ నటించారు. మధుశాలినీ సమర్పణలో రాడికల్ పిక్చర్స్ పతాకంపై దర్శకుడు సృజన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. పల్లె వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.
అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా... రెండు ఓటీటీల్లో ఈ రోజు (సెప్టెంబర్ 17వ తేదీ) నుంచి 'కన్యాకుమారి' స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: త్వరలో ఓటీటీకి 'జూనియర్'... కిరీటి రెడ్డి, శ్రీ లీల సినిమా స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?
View this post on Instagram
థియేటర్లలో విడుదలైన 20 రోజులకే ఓటీటీకి!
ఆగస్టు 27న 'కన్యాకుమారి' థియేటర్లలోకి వచ్చింది. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఎక్కువ కలెక్షన్లు రాలేదు. దాంతో థియేటర్లలో విడుదల అయిన 20 రోజులకు ఓటీటీలోకి వచ్చింది.
శ్రీకాకుళం నేపథ్యంలో 'కన్యాకుమారి'ని తెరకెక్కించారు దర్శకుడు సృజన్. ఈ సినిమాలో శ్రీకాకుళం అమ్మాయిగా గీత్ సైని, అబ్బాయిగా శ్రీచరణ్ రాచకొండ నటనకు పేరొచ్చింది. ఓటీటీలో ఈ సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి కూర్పు: నరేష్ అడుప, ఛాయాగ్రహణం: శివ గాజుల - హరిచరణ్ కె, సంగీతం: రవి నిడమర్తి, సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి, నిర్మాణ సంస్థ: రాడికల్ పిక్చర్స్, సహ నిర్మాతలు: సతీష్ రెడ్డి చింతా - వరీనియా మామిడి - అప్పల నాయుడు అట్టాడ - సిద్ధార్థ్ .ఎ, సమర్పణ: మధుశాలినీ, రచన - నిర్మాణం - దర్శకత్వం: సృజన్.





















