అన్వేషించండి

Mirzapur 4: ‘మీర్జాపూర్ 4‘ చివరి సీజన్ కానుందా? ఈ సీజన్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

రీసెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన ‘మీర్జాపూర్‘ సీజన్ 3కి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ‘మీర్జాపూర్‘ సీజన్ 4కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

Mirzapur Season 4 Release Date: ఓటీటీలో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్‘. రీసెంట్ గా ‘మీర్జాపూర్‘ సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే, గత రెండు సీజన్లతో పోల్చితే ఈ సీజన్ యావరేజ్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘మీర్జాపూర్‘ సీజన్ 4కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడి అవుతున్నాయి.  

ఇప్పటికే  ‘మీర్జాపూర్‘ సీజన్ 4 స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం

‘మీర్జాపూర్’ సీజన్ 3 ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో ‘మీర్జాపూర్‘ సీజన్ 4కు సంబంధించి స్క్రిప్ట్ పనులు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించే పనిలో మేకర్స్ తలమునకలై ఉన్నారట. మూడో సీజన్లో కాలిన భయ్యా తిరిగి మీర్జాపూర్‌ను దక్కించుకున్నాడు. గుడ్డు, గులు ప్రేమలో పడ్డారు. వాళ్ల లిప్ లాక్ సీన్‌తో మూడో సీజన్ ముగిసింది. నాలుగో సీజన్‌లో కథ మరింత రంజుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సీజన్లకు తలదన్నేలా నాలుగో సీజన్ ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట. నాలుగో సీజన్ లో ఊహించని ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు, వీలైనంత త్వరగా నాలుగో సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట.     

గత రెండు సీజన్లతో పోల్చితే మూడో సీజన్ చాలా స్లోగా సాగినట్లు విమర్శలు వచ్చాయి. అయితే, మిగతా వెబ్ సిరీస్ లను ఈ వెబ్ సిరీస్ లతో పోల్చి చూడడం సరికాదంటున్నారు మేకర్స్. ‘మీర్జాపూర్‘ వెబ్ సిరీస్ విడుదలైన సమయంలోనూ చాలా విమర్శలు వచ్చాయనే విషయాన్ని గుర్తు చేశారు. హింస చాలా ఎక్కువగా ఉందని చాలా మంది అన్నా, మంచి హిట్ అయ్యిందని తెలిపారు. నిజానికి హింసాత్మక సన్నివేశాలను షూట్ చేయడం మామూలు విషయం కాదన్నారు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ‘మీర్జాపూర్‘ తదుపరి సీజన్ ఉంటుందని వెల్లడించారు.

‘మీర్జాపూర్‘ సీజన్ 4 వచ్చేది ఎప్పుడంటే?

‘మీర్జాపూర్‘ వెబ్ సిరీస్ ఇప్పటి వరకు మూడు సీజన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతి సీజన్ కు మధ్య చాలా గ్యాప్ ఉంది. తొలి సీజన్ నవంబర్ 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో సీజన్ అక్టోబర్ 2020లో విడుదల అయ్యింది. మూడో సీజన్ జులై 2024లో వచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే సీజన్ 4.. 2026 లేదంటే 2027లో వచ్చే అవకాశం ఉంది. కానీ, ప్రేక్షకులు ఈ సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో గత సీజన్లతో పోల్చితే నాలుగో సీజన్ కాస్త త్వరగానే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. నాలుగో సీజన్ లో ‘మీర్జాపూర్‘ పీఠాన్ని దక్కించుకునేది ఎవరో చెప్పి, మేకర్స్ ఈ సిరీస్‌కు శుభం కార్డు వేయనున్నట్లు తెలుస్తోంది.   

Read Also: బికినీ వేసుకుంటేనే అవకాశాలు వస్తాయన్నాడు - పాత రోజులను గుర్తు చేసుకున్న మనీషా కోయిరాలా

Also Read: త్రిష తొలి వెబ్ సిరీస్ బృంద స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది - ఎప్పుడు, ఎక్కడో చూడొచ్చు అంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Embed widget