అన్వేషించండి

Manisha Koirala: బికినీ వేసుకుంటేనే అవకాశాలు వస్తాయన్నాడు - పాత రోజులను గుర్తు చేసుకున్న మనీషా కోయిరాలా

తన కెరీర్ ప్రారంభంలో బికినీ వేసుకుంటేనే సినిమా అవకాశాలు వస్తాయని చాలా మంది చెప్పేవాళ్లని సీనియర్ నటి మనీషా కోయిరాలా అన్నారు. అయినా, అలాంటి డ్రెస్సులు వేసుకుంటే వచ్చే ఆపర్లు వద్దని చెప్పేదాన్నన్నారు.

Manisha Koirala About Bollywood: అద్భుత చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన ముద్దుగుమ్మ మనీషా కోయిరాలా. రీసెంట్ గా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘హీరామండి- ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ లో కనిపించారు.. తన అద్భుత నటనతో అభిమానులను అలరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన పలు ఆసక్తికర ఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఓ ఫోటోగ్రాఫర్ చెప్పిన మాటలు విని షాక్ అయినట్లు వెల్లడించారు.

ఫోటోగ్రాఫర్ మాటలు విని షాకయ్యా- మనీషా

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనను చాలా మంది ఫోటో షూట్ లు అడిగే వాళ్లని మనీషా కోయిరాలా తెలిపారు. ఓసారి షూట్ కు వెళ్తే ఫోటోగ్రాఫర్ చెప్పిన విషయాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు. “నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఫోటో షూట్ చేస్తామని అడిగేవాళ్లు. కానీ, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓ రోజు అమ్మతో కలిసి ఫోటో షూట్ కు వెళ్లాను. అక్కడ ఓ ఫేమస్ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు. కాబోయే స్టార్ హీరోయిన్ నువ్వే అన్నారు. ముందు సాధారణ డ్రెస్సులో ఫోటో షూట్ చేశారు. ఆ తర్వాత బికినీ పీసులు తెచ్చి ఇచ్చారు. వాటిని వేసుకోమని చెప్పారు. నేను బీచ్ కు వెళ్లినప్పుడు, లేదంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు మాత్రమే బికినీ వేసుకుంటాని చెప్పాను. బికినీ వేసుకుంటేనే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని చెప్పాడు. ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే వచ్చే అవకాశాలు నాకు వద్దని చెప్పాను. నిండైన దుస్తుల్లోనే షూట్ చేయాలని చెప్పాను. ఆ తర్వాత నేను స్టార్ హీరోయిన్ అయ్యాక తనే మళ్లీ నా ఫోటోలు తీసేందుకు వచ్చాడు” అని వెల్లడించారు.    

దశాబ్దం పాటు హీరోయిన్ గా రాణించిన మనీషా

మనీషా కోయిరాలా 1990వ దశకంలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నేపాల్ లో పుట్టినా, భారతీయ సినిమా పరిశ్రమలో అద్భుతంగా రాణించింది. అప్పట్లో ఈమె నటించిన సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచేవి. నిర్మాతలు కోరి మరీ మనీషా కోయిరాలాను తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకునేవాళ్లు. మనీషా కోయిరాలా ‘క్రిమినల్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నటించిన ‘బాంబే’ మంచి సక్సెస్ అయ్యింది. హిందీ సహా పలు భాషల్లో చాలా సినిమాలు చేసింది. సుమారు 10 ఏండ్ల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగించింది. మనీషా అప్పట్లో ఏకంగా డజన్ మందితో రిలేషన్ షిప్ కొనసాగించినట్లు వార్తలు వినిపించాయి.   

స్టార్ హీరోయిన్ గా రాణించినా జీవితంలో ఎన్నో కష్టాలు  

మంచి కుటుంబం, అగ్ర తారగా రాణించినా వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు మనీషా. పెళ్లి తర్వాత తన జీవితం అత్యంత దారుణంగా మారినట్లు చెప్పారు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే భర్త నుంచి చాలా బాధలు పడ్డట్లు వెల్లడించారు.  అతడితో తట్టుకోలేక కేవలం 6 నెలల్లోనే విడాకులు ఇచ్చినట్లు చెప్పారు. అప్పటి నుంచి మనీషా ఒంటరిగానే ఉంటున్నారు.  ఆరోగ్య పరంగానూ ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యాన్సర్ సోకి చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. చివరకు క్యాన్సర్ ను జయించారు. ప్రస్తుతం మళ్లీ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు.

Also Read: త్రిష తొలి వెబ్ సిరీస్ బృంద స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది - ఎప్పుడు, ఎక్కడో చూడొచ్చు అంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Embed widget