Maaman OTT Telugu: తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న తమిళ్ ఫ్యామిలీ ఫిల్మ్... కొత్త జంట మధ్యలో మేనల్లుడి చిచ్చు
Maaman Telugu Streaming: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ్ యాక్టర్స్ సూరి, రాజ్ కిరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మామన్'. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగు ప్రేక్షకులకూ తమిళ్ కమెడియన్ సూరి తెలుసు. ఆయన డబ్బింగ్ సినిమాలతో పరిచయం. సీనియర్ కోలీవుడ్ యాక్టర్ రాజ్ కిరణ్ కూడా అంతే! విశాల్ 'పందెం కోడి' సహా పలు డబ్బింగ్ సినిమాల్లో కనిపించారు. వీళ్ళిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మామన్'. ఆగస్టు 8వ తేదీ నుంచి తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు తెలుగుతో పాటు మరొక భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
వినాయక చవితికి తెలుగులో 'మామన్' స్ట్రీమింగ్!
Manam Movie Streaming Now In Telugu: ఆగస్టు 8వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో 'మామన్' తమిళ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తేదీ నుంచి తెలుగు, కన్నడ భాషల్లోనూ వీక్షకులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి.
Also Read: 'సువ్వి సువ్వి'తో ప్రియాంక రోల్ ఏమిటో తెలిసిందిగా... 'ఓజీ'లో పవన్ గ్యాంగ్‌స్టర్ అయితే హీరోయిన్?
Biggest family blockbuster #Maaman now streaming in Telugu & Kannada on ZEE5..♥️@sooriofficial @p_santh @HeshamAWmusic @kumarkarupannan @larkstudios1 @AishuL #Swasika #RajKiran #JayaPrakash @Bala_actor #BabaBaskar @ActorViji @nikhila_sankar_ @kailasam_geetha @DKP_DOP… pic.twitter.com/rMG0QXil97
— ZEE5 Tamil (@ZEE5Tamil) August 27, 2025
'మామన్' కథ ఏమిటి? తెలుగు వారికి నచ్చుతుందా?
Maaman Movie Story In Telugu: 'మామన్' తమిళ్ సినిమా అయినప్పటికీ... మన తెలుగు ప్రేక్షకులకు సైతం నచ్చే కథ, ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. ఇందులో ఇన్‌బా పాత్రలో సూరి నటించారు. అతని చెల్లెలు గిరిజ (శ్వాసిక)కు వివాహమైన పదేళ్ల తర్వాత ఓ బాబు పుడతాడు. ఎంతో మంది దేవుళ్ళకు మొక్కిన తర్వాత జన్మించిన మేనల్లుడు నిలన్ (ప్రగీత్ శివన్) అంటే ఇన్‌బాకు అమితమైన ప్రేమ. చిన్నారిని లడ్డు అని పిలుస్తుంటాడు. ఇన్‌బాకు పెళ్ళైన తర్వాత పరిస్థితులు మారతాయి. అతని జీవితంలోకి భార్య రేఖ (ఐశ్వర్య లక్ష్మి) వస్తుంది. ఎప్పుడూ మామ చుట్టూ లడ్డు తిరగడం రేఖకు నచ్చదు. అప్పుడు ఆవిడ ఎటువంటి నిర్ణయం తీసుకుంది? లడ్డు వల్ల ఇన్‌బా, రేఖ దంపతులు విడిపోతారా? లేదంటే మామపై మేనల్లుడికి ఉన్న ప్రేమను రేఖ అర్థం చేసుకుందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: సుందరకాండ రివ్యూ: పెళ్లి కాని యూత్ రిలేటయ్యే సీన్స్, మరి పాయింట్? నారా రోహిత్ సినిమా ఎలా ఉందంటే?





















