News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Lust Stories 2 Teaser : పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా? హాట్ హాట్‌గా తమన్నా, మృణాల్ వెబ్ సిరీస్ టీజర్!

తమన్నా నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్ 2' టీజర్ విడుదలైంది. ఒక్క డైలాగుతో సిరీస్ ఎలా ఉంటుందో చెప్పేశారు.

FOLLOW US: 
Share:

భారతీయ ఓటీటీలో 'లస్ట్ స్టోరీస్' ఓ సంచలనం. కియారా అడ్వాణీ, భూమి పెడ్నేకర్, రాధికా ఆప్టే, మనీషా కొయిరాలా నటించిన శృంగార సన్నివేశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విమర్శలు, వివాదాలతో పాటు ప్రశంసలు సైతం అందుకుంది. గతం గతః. 'లస్ట్ స్టోరీస్' తర్వాత బోల్డ్ సీన్స్ ఉన్న సిరీస్‌లు వచ్చాయి. అయితే... దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళకు గుడ్ న్యూస్! ఈ నెలాఖరున 'లస్ట్ స్టోరీస్ 2' రాబోతోంది. లేటెస్టుగా టీజర్ విడుదల చేశారు. 

పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా?
Lust Stories 2 Teaser Review : 'ఓ చిన్న కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తారు కదా! మరి, పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా?' - 'లస్ట్ స్టోరీస్ 2' టీజర్ ప్రారంభంలో ఓ బామ్మ చెప్పే డైలాగ్! ఇదొక్కటీ చాలు... సిరీస్ ఎలా ఉంటుందో చెప్పడానికి! శృంగార సన్నివేశాలు ఉంటాయని ఒక్క మాటతో స్పష్టం చేశారు. పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదన్నట్టు సమర్ధించారు. 

హాట్ హాట్‌గా తమన్నా, మృణాల్!
'లస్ట్ స్టోరీస్ 2' మీద సౌత్ ఇండియన్ ఆడియన్స్ చూపు పడుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఆమె బాయ్ ఫ్రెండ్, నాని 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో విలన్ రోల్ చేసిన విజయ్ వర్మ కూడా ఉన్నారు. ఈ సిరీస్ షూటింగ్ చేసేటప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమలో పడినట్లు బాలీవుడ్ ఖబర్. టీజర్ చూస్తే... ఇద్దరు బెడ్ మీద ముద్దు పెట్టుకున్న సీన్ ఉంది. 

'లస్ట్ స్టోరీస్ 2'లో దక్షిణాది ప్రేక్షకులను ఆకర్షించే మరో కథానాయిక మృణాల్ ఠాకూర్. 'సీతా రామం' సినిమాతో తెలుగు, మలయాళ ప్రేక్షకులల్లో ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. తమన్నాతో పాటు మృణాల్ సైతం శృంగార సన్నివేశాలు చేశారట.ఇంకా 'లస్ట్ స్టోరీస్ 2'లో కాజోల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, అమృతా సుభాష్, అంగద్ బేడీ, తిలోత్తమా షోమే నటించారు. 

జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ 
Lust Stories 2 Release Date : నాలుగు కథల సమాహారంగా 'లస్ట్ స్టోరీస్ 2'ను తెరకెక్కించారు. ఫస్ట్ సీజన్ కూడా అంతే! ఒక్కో కథకు ఒకొక్కరు దర్శకత్వం వహించారు. 'లస్ట్ స్టోరీస్ 2'లో కథలకు సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ దర్శకులు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికలో జూన్ 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. హిందీలో తీసినప్పటికీ... దక్షిణాది భాషల్లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు.

Also Read : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్‌కు అంత ఖర్చా?

'లస్ట్ స్టోరీస్' ఫస్ట్ సీజన్ విడుదలైన తర్వాత విమర్శలు, ప్రశంసలు వచ్చినట్టు... సెకండ్ సీజన్ సైతం సంచలనం సృష్టిస్తుందో? లేదో? చూడాలి. ఈసారి సౌత్ ఆడియన్స్ కూడా ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తూ ఉండటం లాభించే అంశమే. 

Also Read మహేష్ బాబు వెళ్ళింది ఎవరి ఫంక్షన్‌కో తెలుసా? మధ్యలో అఖిల్ ఎందుకొచ్చాడు?

Published at : 06 Jun 2023 01:00 PM (IST) Tags: Tamannaah Mrunal Thakur Vijay Varma Lust Stories 2 Teaser Review Lust Stories 2 Release Date Lust Stories 2 Streaming Date Lust Stories 2 OTT Platform

ఇవి కూడా చూడండి

Miss Shetty Mr Polishetty OTT : ఈ వారమే ఓటీటీలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

Miss Shetty Mr Polishetty OTT : ఈ వారమే ఓటీటీలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

Upcoming OTT Movies: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల

Upcoming OTT Movies: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల

RDX OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?

RDX OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?

DD Returns: తెలుగులో సంతానం తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

DD Returns: తెలుగులో సంతానం తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

టాప్ స్టోరీస్

Lokesh No Arrest : లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే - అన్ని కేసుల్లో అసలేం జరిగిందంటే ?

Lokesh No Arrest :   లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే  - అన్ని  కేసుల్లో అసలేం జరిగిందంటే ?

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!